mla padi kaushik reddy: బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

దిశ దశ, కరీంనగర్:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ అయింది. మంగళవారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా ఆయనకు బెయిల్ ఇవ్వడం ద్వారా నిర్ణయం తీసుకున్నారు. రూ. 50 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

సుదీర్ఘ వాదనలు… 

పాడి కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చిన తరువాత దాదాపు గంట సేపు వాదనలు జరిగాయి. ఆయన తరుపున సీనియర్ న్యాయవాది ఈ మధుసూధన్ రావు, సర్దార్ రవిందర్ సింగ్ లు వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి బెయిల్ అందించిన సుప్రీం కోర్టుకు ప్రస్తుతం మెజిస్ట్రేట్ ను అందించారు. ప్రాసిక్యూషన్ తరుపున వాదనలు వినిపించిన పీపీ కౌశిక్ రెడ్డి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని మెజిస్ట్రేట్ ను అభ్యర్థించారు. చివరకు బెయిల్ ఇవ్వడంతో మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు.

కొండను తవ్వి… 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో హంగామా అంతా కూడా వృధా అయినట్టుగానే అనిపిస్తోంది. కరీంనగర్ ఆర్డీఓ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలు హైదరాబాద్ కు వెల్లాయి. ఒక వైసీపీ, సీఐతో పాటు 30 మంది వరకు పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు భాగ్యనగరం చేరుకున్నారు. ఆయనను సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసిన తరువాత సీటీసీకి, అక్కడి నుండి త్రీ టౌన్ కు. అదే స్టేషన్ లో కౌశిక్ రెడ్డి రెస్ట్ తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కౌశిక్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుతో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశాలున్నాయన్న సంకేతాలు వెళ్లాయి. చివరకు ఆయనకు బెయిల్ ఇవ్వడం బెయిలబుల్ సెక్షన్ల కేసుకే ఇంత సీన్ క్రియేట్ చేశారా అన్న చర్చ మొదలైంది.

నిపుణులతో చర్చలు..? 

BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై పెట్టిన సెక్షన్లు బెయిలబుల నాన్ బెయిలబుల అన్న విషయంపై న్యాయనిపుణులతో చర్చించకుండానే ఆయనను అరెస్ట్ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఆధేశాల ప్రకారం 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే సెక్షన్లలో కేసులు నమోదు చేసినట్లయితే నిందితులకు నోటీసులు ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. ఇఫ్పటికే చాలా కేసుల్లో నోటీసులు ఇచ్చి పంపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే విషయంలో మాత్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్నదే అంతుచిక్కకుండా పోతోంది. చివరకు అదే పరిశీలన మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించిన కౌశిక్ రెడ్డి తరుపు న్యాయవాదులు బెయిల్ ఇప్పించడంలో సఫలం అయ్యారు. పోలీసులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో న్యాయ నిపుణులతో చర్చించేందుకు ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పాటు చేశారు. లీగల్ సెల్ ప్రతినిధులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీనియర్ న్యాయవాదులతో చర్చించినట్టయితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్ జనరల్ నుండి కమిషనరేట్స్, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో లీగల్ సెల్ నిపుణులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో సరైన సలహాలు, సూచనలు తీసుకోలేకపోయారా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. కోర్టుల్లో తరుచూ జరిగే ప్రక్రియను తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏధి ఏమైనా కౌశిక్ రెడ్డి విషయం మాత్రం సరికొత్త చర్చకు దారి తీసినట్టయింది.

కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన వీడియో కోసం ఈ కింది క్లిక్ చేయండి…

You cannot copy content of this page