శంకరపట్నం మండలం ధర్మారంలో ఘటన
దిశ దశ, మానకొండూరు:
అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను స్థానిక యువకులు అడ్డుకున్నారు. గ్రామంలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయికి అడ్డుగా వెల్లి మరీ యువకులు తమ గ్రామ అభివృద్ది ఏమైందంటూ ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు మాటల యుద్దం చోటు చేసుకుంది. బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామ అభివృద్ది ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో స్ఠానిక బీఆర్ఎస్ నాయకులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే తమ గ్రామానికి నిధుల గురించి స్థానిక సర్పంచిని గతంలోనే అడిగితే ఎమ్మెల్యే, ఎంపీలను అడగాలని చెప్పాడని దీంతో తమ గ్రామానికి వచ్చిన రసమయిని అడిగే ప్రయత్నం చేయగా తమను నెట్టేసీ వెల్లిపోయారన్నారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ కలిసి తాము రసమయిని అభివృద్ది గురించి అడగిన క్రమంలో సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు. అయితే రసమయి బాలకిషన్ లక్ష్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల చర్చనీయాంశంగా మారాయి.
