ఓట్ల బిచ్చగాళ్లమంటూ కామెంట్
దిశ దశ, జగిత్యాల:
అధికార పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. గతంలో కూడా అధికారులు మాటలు వినడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా చేశారు. తాజాగా ఆదివారం ఉదయం జగిత్యాల కాలేజ్ గ్రౌండ్ లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియో మంగళవారం ఉదయం నెట్టింట వైరల్ అవుతోంది. కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గ్రౌండ్ లో ట్రాక్ ఏర్పాటు చేయాలన్న ఆలోయన తనకు మొదటి నుండి ఉందన్నారు. తాను గతంలో ఇక్కడ చదువుకున్న వానిగా అంటూనే ఎందుకంటే నా నోట్లకొల్లి కొద్దిగా తప్పు వస్తే 300 ఓట్లు పోతాయ్, ఇంకా ఐదు వందలు పోతాయ్ అని కామెంట్ చేయగా వేదికపైన ఉన్న వారు నవ్వుకున్నారు. మంచి మాట్లాడితే ఓట్లు పోతాయని, సరే ఇగ రాజకీయాల్లోకి వచ్చిన ఓట్ల బిచ్చగాళ్లం… ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలో చూడలంటారు కానీ పొడగొట్టుకోలేం కదా అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఆ కాలంలో కాలేజీ బ్రహ్మండంగా ఉండేది ఓ రోడ్ దాక గ్రౌండ్, ఈ రోజు గ్రౌండ్ కుంచించుక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాగా బాధినిపిస్తుంది అయితే మీకెందుకు బాధ అనిపించింది మీరు ఆడేదా పొడిసేదా అని మీరు అనుకోవచ్చు… అంటూ డాక్టర్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు సభికుల్లో నవ్వులు పూయించాయి. అయితే డాక్టర్ సంజయ్ నోట వెలువడిన ఈ వ్యాఖ్యలు నేడున్న పరిస్థితులకు కళ్లకు కట్టినట్టుగా ఉన్న పాలిటిక్స్ చేస్తున్నందున నోరు మూసుకుని బ్రతకాల్సిన పరిస్థితి తయారైందని చెప్పకనే చెప్పినట్టుగా స్పష్టమవుతోంది. ఏది ఏమైనా జగిత్యాల ఎమ్మెల్యే చేసి వ్యాఖ్యలు మాత్రం మరోసారి చర్చకు దారి తీశాయి.