హెలిక్యాప్టర్ పంపి అడవి బిడ్డలను కాపాడండి

కన్నీటి పర్యంతం అయిన సీతక్క

దిశ దశ, ములుగు:

ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీటి పర్యంతం అయ్యారు జిల్లాలోని అటవీ గ్రామాల్లోని ప్రజలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నారని వారిని కాపాడేందుకు ఎయిర్ లిప్ట్ మాత్రమే గత్యంతరం అయినందున ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. కొద్ది సేపటి క్రితం సీతక్క మీడియాతో మాట్లాడుతూ… ఉదయం నుండి హెలిక్యాప్టర్ పంపించాలని అడుగుతూనే ఉన్నామని… ఇప్పటి వరకు కొండాయి గ్రామంలో ఎంత మంది ఉన్నారో ఎంతమంది గల్లంతయ్యారో తెలియకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కోసం వారి పీఏల ద్వారా ప్రయత్నించామని, మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా చెప్పామన్నారు. రెస్క్యూటీం వల్ల గమ్యం చేరడం సాధ్యం కావడం లేదని, హెలిక్యాప్టర్ పంపించి అక్కడ చిక్కుకున్న అడవి బిడ్డలను కాపాడాలని సీతక్క కోరారు. ఆ ప్రాంతంలో మూడు గ్రామాల ప్రజలు ఉన్నారని వారిలో వందమంది డేంజర్ జోన్ లో ఉన్నారని, వారిలో ఆరుగురు గల్లంతయ్యారని తెలిసిందని ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదికన హెలిక్యాప్టర్ ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో చిక్కుకున్న వారిని కాపాడాలని అభ్యర్థించారు. ఉధయం 9 గంటల నుండి చెప్తున్నామని ఈ ప్రాంతంలో వాగులు, చెరువులు ఉన్నందును పంపించాలని కోరామని, ప్రాజెక్టు పేటకు చెందిన ఓ కుటుంబం కొట్టుకపోయిందని, ఏటూరునాగారం మండలం కొండాయిలో తాజాగా మరో ఆరుగురు గల్లంతయ్యారని ఇంకా వందమంది అక్కడ చిక్కుకుని ఉన్నారన్నారు. యెలిశెట్టిపల్లి చుట్టూ కూడా వాగులు ఉన్నాయని… అటవీ గ్రామ ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెలిక్యాప్టర్ పంపించాలని సీతక్క కోరారు.

You cannot copy content of this page