సిగ్గూ శరం లేదా..?: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

దిశ దశ, కరీంనగర్:

రైతు బంధు తీసుకుంటున్నావా..? 24 గంటల ఉచిత కరెంటు తీసుకోవడం లేదా ..? సిగ్గూ శరం లేదా నీకు అంటూ ఓ రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎధురు దాడి జరిగిన ఘటన సంచలనంగా మారింది. శనివారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది పురస్కరించుకుని నిర్వహిస్తున్న రైతు దినోత్సవంలో ఎమ్మెల్సీకి, రైతుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అబాది జమ్మికుంటలో నిర్వహించిన ఈ సమావేశంలో బుర్ర కుమార్ అనే రైతు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అందిస్తామన్న సాయం ఏదని ప్రశ్నించారు. మూడు నెలలు గడిచినా పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎదురు దాడికి దిగి రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసుల నీకెన్ని ఎకరాల భూమి ఉంది అని ఎమ్మెల్సీ రైతు బుర్ర కుమార్ ను ప్రశ్నించగా తనకు మూడు ఎకరాలు ఉందని వివరించాడు. సిగ్గు లేదా నీకు, సిగ్గూ శరం లేదా నీకు రైతు బంధు తీసుకోవడం లేదా..? 24 గంటల ఉచిత కరెంటు తీసుకోవడం లేదా అంటూ కౌంటర్ అటాక్ చేశారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. రైతు కూడా తన వాదనలు వినిపిస్తున్న క్రమంలో జై కైసీఆర్ అంటూ సమావేశాన్ని ముగించి అక్కడి నుండి వెల్లిపోయారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్న విషయాలను వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సభలు కూడా రైతు వేదికల్లోనే నిర్వహించాలని సూచించారు. అయితే రైతుల కోసం నిర్మించిన భవనంలోనే ఓ రైతును ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://www.youtube.com/watch?v=ZiXL2VxJ1vI

You cannot copy content of this page