లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి 9.12 నిమిషాలకు ఈడీ కార్యాలయంల నుండి బయటకు వచ్చారు. దాదాపు 10.30 గంటల సేపు విచారణ ఎదుర్కొన్న కవిత బయటకు రావడంతో ఇప్పటి వరకు ఈడీ కార్యాలయం వద్ద ఉన్న స్తబ్దత వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. ఉదయం ఎలా అయితే నవ్వు కుంటూ ఈడీ ఆఫీసులోకి వెల్లారో రాత్రి బయటకు వచ్చేప్పుడు కూడా కవిత నవ్వుతూ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన కవిత నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే సాయంత్రం 7 గంటలకే బయటకు వస్తారని ప్రచారం జరగడంతో కవిత ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఉత్కంఠత నెలకొంది. పోలీసు బలగాలు కూడా ఈడీ కార్యాలయం ముందు మోహరించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఆందోళన నెలకొంది. సాయంత్రం అడిషనల్ ఏజీ రామచందర్ రావు, అడ్వకేట్లు సోమా భరత్, మోహన్ రావులు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఈడీ కవితకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది.
