కస్టడీకి అనుమతించిన కోర్టు… 15 వరకు విచారించనున్న సీబీఐ

దిశ దశ, న్యూఢిల్లీ:

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 15 వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించిన కేసులో సీబీఐ నేర పూరితమైన అంశాలపై విచారించనుంది.

విరుద్దం…

సీబీఐ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని కవిత తరుపు న్యాయవాదులు వాదించారు. కోర్టు అనుమతి తీసుకోకుండా అమెను అరెస్ట్ చేశారని, ముందస్తు సమాచారం లేకుండా ఆమెను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సీబీఐ తీసుకున్న నిర్ణయం అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కవిత కూడా సీబీఐ తీరు గురించి రౌస్ ఎవెన్యూ కోర్టుకు లేఖ కూడా రాసింది. ఇటీవల రాసిన లేఖలో ఆమె సీబీఐ గురించి కూడా ప్రస్తావించింది.

సీబీఐ వాదనలు…

దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలను గమనిస్తే ఎక్సైజ్ పాలసీలో కీలక కుట్రదారుల్లో ఆమె ఒకరని తేలిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అనవసరమైన కారణాలను చూపుతూ ఆమె విచారణకు హాజరు కాలేదని, అందువల్లే ఆమెను విచారించలేకపోయామని,
విచారణలో ఆమె పాత్రకు సంబంధించి తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కోంది.  కవిత ఇచ్చిన సమాధానాలకు తాము సేకరించిన ఆధారాలతో పోల్చినప్పుడు విరుద్ధంగా ఉన్నాయని,  వాస్తవాలను ఆమె దాచిపెడుతోందని సీబీఐ ఆరోపించింది. గతంలో కూడా ఆమె నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదని, మద్యం పాలసీకి సంబంధించిన పెద్ద కుట్రను వెలికితీసేందుకు కవితను సాక్ష్యాలతో విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఆమె మెయిన్ కింగ్‌పిన్ కుట్రదారు గా ఉన్నారని, లిక్కర్ పాలసీ స్కాంలో కవిత ప్రమేయం ఖచ్చితంగా ఉందని తేల్చి చెప్పింది. డబ్బులు చేతులు మారడంలో కవిత కీలకంగా వ్యవహరించారని, తిహాడ్ జైల్లో విచారించినప్పుడు కూడా సహకరించలేదని సీబీఐ వెల్లడిచింది. ఐదు రోజులు కస్టడీకి ఇచ్చినట్టయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఇందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించింది.

రిమాండ్ రిపోర్టులో ఇలా…

హవాలా మార్గాలో డబ్బులు తరలింపు జరిగిందని కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ అంగీకరించారని, అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా డబ్బులు తరలించినట్లు అశోక్ కౌశిక్ చెప్పారని కవిత అరెస్ట్ నేపథ్యంలో కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది సీబీఐ. అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్లు డెలివరీ అయినట్లు కాల్ రికార్డ్స్ ద్వారా కూడా వెలుగులోకి వచ్చిందని, ఆ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలు ఖర్చు చేశారని, ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయని వివరించింది. శరత్ చంద్రారెడ్డికి ఐదు జొన్లు దక్కిన వ్యవవహారంలో శరత్ చంద్రారెడ్డికి కవితకు మధ్య రూ. 14 కోట్ల రూపాయల మేర జరిగిన లావాదేలకు సంబంధించిన బ్యాంక్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సీబీఐ వివరించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద ఒక వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో కూడా కవిత శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి చేశారని, అరబిందో అనుబంధ కంపెనీ అయిన మహిరా వెంచర్స్ ద్వారా భూమి కొనుగోలు ఒప్పందం జరిగేటట్లు ఆ కంపెనీ నుండి రూ. 14 కోట్లు చెల్లించేందుకు శరచంద్రారెడ్డి పై కవిత ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆప్ నేతలకు తానే రూ. 100 కోట్ల ఇచ్చానని… 5 రిటైల్ జోన్లలో వ్యాపారం దక్కినందున ఒక్కో జోనుకు రూ. ఐదు కోట్ల చొప్పున రూ. 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. రూ. 25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో తెలంగాణలోను ఢిల్లీ లోను వ్యాపారాలు చేయనివ్వనని కవిత బెదిరించారని, హోల్ సేల్ వ్యాపారం నిర్వహించే ఇండోస్పిరిట్ కంపెనీ లో కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఉన్నారని, తన రిటైల్ జోన్స్ కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వద్దని కూడా పిళ్ళై కి కవిత చెప్పారని శరత్ చంద్రారెడ్డి వెల్లడించారని పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారని… ఈ అంశాలపై కవితను మరింత ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ వివరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చాలా కీలక వ్యక్తి ఆమె పాత్ర చాలా స్పష్టంగా కనబడుతోందని, రూ. 100 కోట్ల ముడుపులు సేకరించడంలోనూ ఆప్ నేతలకు చెల్లించడంలోనూ కవిత నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కోంది. సౌత్ గ్రూపునకు చెందిన మద్యం వ్యాపారి, కవితలు అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారని, ఈ వ్యవహారంలో కవిత అంతా సమన్వయం చేస్తున్నారని కేజ్రీవాల్ ఆ వ్యాపిరతో చెప్పారన్నారు. ఆప్ నేతలకు ఇవ్వడం కోసం రూ.100 కోట్లు కావాలని వెంటనే రూ.50 కోట్లు ఏర్పాటు చేయాలని కవిత మద్యం వ్యాపారిని కోరాడంతో తన కుమారుడి ద్వారా రూ. 25 కోట్లు కవిత సన్నిహితులకు ఆ మద్యం వ్యాపారి అందజేశారని వివరించింది. అభిషేక్ బోయినపల్లి ద్వారా డబ్బు సమకూర్చినట్లు ఆ డబ్బులు గోవా ఎన్నికల కు తరలినట్లు అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా చెప్పారని, అలాగే “తెలంగాణ జాగృతి” సంస్థ కోసం శరత్ చంద్ర రెడ్డి రూ. 80 లక్షలు ఇచ్చారని కూడా సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టుకు విన్నవించింది. 

You cannot copy content of this page