ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత భర్తకు చిక్కులు తప్పవా..?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచాయి. విచారణను మరింత వేగవంతం చేశాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో మలుపు ఇందులో జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిక్కుకోగా.. త్వరలో ఆమె భర్త అనిల్ కుమార్ కూడా చిక్కుకుంటారని తెలుస్తోంది. ఆయనకు కూడా త్వరలో ఈడీ నోటీసులు వచ్చే అవకాశముందని, ఆయనను స్కాం గురించి ప్రశ్నించే అవకాశముందని చెబుతున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్ లోని కవిత ఇంట్లో జరిగిన కొంతమంది వ్యాపారుల సమావేశంలో అనిల్ కుడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో సమావేశం జరగ్గా.. సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి కూడా ఇందులో పాల్గొన్నట్లు ఈడీ గుర్తించింది.

పాలసీ రూపకల్పనతో పాటు ఈ కేసులోని నిందితుల పాత్ర గురించి అనిల్ కుమార్ ను ప్రశ్నించే అవకాశముంది. ఇటీవల ఈ కేసులో పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును ఇటీవల సీబీఐ అదుపులోకి తీసుకుని రిమాండ్ లోకి తీసుకుంది. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తోంది. దీంతో త్వరలో కవితతో పాటు ఆమె భర్త అనిల్ కు కూడా నోటీసులు అందే అవకాశముందని చెబుతున్నారు.

కవితను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి తరణుంలో అనిల్ కుమార్ కూడా ఈడీ నోటీసులు వస్తాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసులో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి సంచలన పరిణామాలు చోటుచేసుుంటాయనేది వేచి చూడాలి.

You cannot copy content of this page