మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే 2023ని పెట్టారు. ప్రభుత్వ సామాజిక పథకాలను పొందేందుకు ఆధార్ ఎంతో అవసరం. అయితే 318 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 720 డీబీటీ పథకాలు ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 7 కింద నోటిఫై అయింది. ఆర్థిక సర్వే ఆధార్ కార్డు ఏ విధంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ (Aadhaar Payment Bridge) ద్వారా ఎవరైనా ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ వివరాలు ఇవ్వాలి. ఈ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్‌తో ఆధార్ సహాయంతో అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. డోర్ స్టేప్ బ్యాంకింగ్ సైతం పొందవచ్చు. కొవిడో-19తో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు వీలు అవుతోంది.
జన్‌ధన్, ఆధార్, మొబైల్ ట్రినిటీ లేదా జామ్ డీబీటీతో ఇచ్చే సర్వీస్. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని విజయవంతం చేయడానికి ఆధార్ కార్డ్ కీలక పాత్ర పోషించింది. డూప్లికేట్, తప్పుడు లబ్ధిదారులను తొలగించేందుకు లింక్ చేస్తే సరిపోతుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా ఇస్తోంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వృద్ధులు వాళ్ళ ఫోన్స్ నుండే జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించచ్చు. అలానే పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేస్ అథెంటికేషన్ హెల్ప్ అవుతుంది.