దిశ దశ, జాతీయం:
అరణ్యంలో ఉండే కోతులు జనారణ్యంలోకి వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలోకి వెల్తేనే కోతులు వాటి చేష్టలు కనిపించేవి. చెట్ల కొమ్మల మీద నుండి ఎగరడం వంటి చర్యలు వనాల్లోకి వెల్లినప్పుడు మాత్రమే కనిపించేవి. కానీ అటవీ ప్రాంతాల్లో సహజంగా దొరికే ఆహారం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలన్ని మైదానాలుగా మారుతుండడంతో అవి జనాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దశాబ్దాల క్రితం కోతి కొమ్మచ్చి పేరిట ఆట ఆడుకునేందుకు అటవీ ప్రాంతాల్లోకి వెల్లే వారు. చిన్నతనంలో కోతుల్లానే చెట్లపై నుండి దూకుతూ ఆడుకునే వారు. కానీ ఇప్పుడు అవి జనాల్లోకి వచ్చి చేరడంతో వాటి చేష్టలను ప్రత్యక్ష్యంగా చూస్తున్నాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో కోతుల ఆటల తీరుకు దర్పణం పడుతోంది. ఓ రిసార్ట్స్ లోకి వచ్చిన కోతులు స్విమ్మింగ్ ఫూల్ వద్దకు చేరుకుని వాటి స్వేచ్ఛగా ఎంజాయ్ చేశాయి.స్విమ్మింగ్ ఫూల్ వద్దకు చేరుకున్న కోతుల సమూహం (group of monkeys) అందులో దూకుతూ ఈత కొడుతూ కనిపించాయి. రిసార్ట్స్ లో స్విమ్మింగ్ ఫూల్ పక్కనే టూరిస్టులు సెద తీరేందుకు ఏర్పాటు చేసిన ఓ గొడుకుపైకి ఎక్కి మరీ స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకుతూ తమలోని కోతి చేష్టలను ప్రదర్శించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ‘‘ఎక్స్’’ ట్విట్టర్ వేదికపై షేర్ చేశారో నెటిజన్. ఒకప్పుడు ఇలాంటి రిసార్ట్స్ లను మనుషులు ఆస్వాదించేవారు అన్న కామెంట్ ను ట్యాగ్ చేశారు. కోతులు రిసార్ట్స్ వాతావరణాన్ని తనివితీరా అస్వాదిస్తున్నాయని ఆ నెటిజన్ చెప్పకనే చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతులు ఎంజాయ్ చేస్తున్నాయని. వాటి స్విమ్మింగ్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ విడియోపై వస్తున్న కామెంట్లు వైవిధ్యంగా ఉంటున్నాయి. (Viral Video) ఏది ఏమైనా కోతి చేష్టలు కోతి చేష్టలే కదా.
https://x.com/rupin1992/status/1399542551489564674?t=5qPz4jgMnmZLMdTjYyvoBQ&s=0