కోడి పందాలను మించిన క్రేజీ… సంక్రాంతికి సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత…

అమలాపురం రోడ్లపై ఖరీదైన కారు…

దిశ దశ, ఏపీ బ్యూరో:

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ప్రాంత వాసులంతా కోడి పందాలపైనే క్రేజీ పెంచుకుంటారు. బెట్టింగ్ లో పాల్గొనేందుకు కొదరు, చూసి ఆనందించే వారు మరి కొందరు, కోళ్లను పందెంలోకి దింపె యజమానుల ఆలోచనలన్ని కూడా అటువైపే సాగుతుంటాయి. కోడి పందాలు జరిగే ప్రాంతంలో వ్యాపారం చేసి ఉపాధి పొందాలని ఆశించే వారు ఇలా కోనసీమలో చాలా మంది కూడా పందెం కోళ్లలా పరుగులంకించుకుంటుంటారు. సంక్రాతి పండగ పూర్తయ్యే వరకు కూడా కోడి పందాలు జరిగే ప్రాంతాలకే వేలాది మంది పరిమితం అవుతుంటారు. అయితే ఈ కోడి పందాలను మించిన క్రేజీ అమలాపురంలో క్రియేట్ చేశారు ఓ నిర్మాత. కోనసీమ అల్లుడైన ఆదిత్యరామ్ అమలాపురంకు అత్యంత ఖరిదైన కారులో రావడంతో అందరి దృష్టి ఆ కారుపైనే పడింది. చెన్నైకి చెందిన ప్రముఖ నిర్మాత ఆదిత్య రామ్ రూ. 12 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కారులో అమలాపురం రోడ్లపై ప్రత్యక్ష్యం కావడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. సాధారణంగా కోడి పందాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఖరీదైన కార్లలో ఈ ప్రాంతానికి  వస్తుంటారు కానీ వారంతా కోడి పందాలు జరిగే చోటకు మాత్రమే పరిమితం అవుతారు. చెన్నై ప్రొడ్యూసర్ ఆదిత్య రామ్ ఇక్కడి అల్లుడిగా రోల్స్ రాయిస్ కారులో రావడంతో ప్రతి ఒక్కరి దృష్టి అతనిపై పడింది. అత్యంత ఖరీదైన కారు కావడంతో జనం కూడా ఆ కారును చూసేందుకు ఆసక్తి కనబర్చారు. ఇక ఆదిత్య రామ్ రాకతో అతని స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోడ్లపై బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. దీంతో కోనసీమ ప్రాంతంలో రోల్స్ రాయిస్ కారు గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు జనం. సంక్రాంతికి సినీ రంగానికి చెందిన వారు వైవిద్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటే మా కోనసీమ అల్లుడు ఆదిత్య రామ్ మాత్రం ఖరీదైన కారులో వచ్చి అందరిలో ఆసక్తిని రేకెత్తించారంటూ స్థానికులు కామెంట్స్ చేస్తున్నారు.

అమలాపురం రోడ్లపై తిరుగుతున్న రోల్స్ రాయిస్ వీడియో కోసం ఈ కింది లింక్ పై ప్రెస్ చేయండి.

You cannot copy content of this page