హౌ ఎబౌట్ మీ?

షాకిచ్చిన కాప్స్

క్రెడిట్ కొట్టేయాలంటే సన్మార్గంలో అయితేనే బెటర్ అనుకోకండి.. క్రిమినల్ వ్యవహారాల్లోనూ తమ నైపుణ్యాలను ప్రదర్శించే వారూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం కథలుకథలుగా చెప్పుకుంటుంటాం. కానీ తాము చేసే నేర ప్రవృత్తిలోనూ గుర్తింపు రాకపోతే పోలీసులు నిలదీసే తత్వం ఆ క్రిమినల్ కే చెల్లింది. వినడానికి వెరైటీగా ఉన్నా అక్షరాల జరిగిన నగ్నసత్యం ఇది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది నేరమయ ప్రపంచంతో అనుబంధం పెన వేసుకున్న ఓ క్రిమినల్ తన ఫోటో ఇతర వివరాలు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో లేకపోవడం ఏంటని షాక్ గురయ్యాడు. వెంటనే సోషల్ మీడియాల వేదికగా హౌ అబౌట్ మీ అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే…
అమెరికాలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. అమెరికా పోలీసులు రూపొందించిన ‘మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌’లో తన పేరు లేదంటూ పరారీలో ఉన్న ఓ నేరస్థుడు ఫేస్‌బుక్‌ వేదికగా కామెంట్‌ పెట్టడం సంచలనంగా మారింది. అమెరికా జార్జియాలోని టాప్‌ 10 మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుల జాబితాను రాక్‌డేల్‌ కౌంటీ షెరీఫ్‌ పోలీసులు ఇటీవల విడుదల చేశారు. హత్యలు, సాయుధ దోపిడీ, కిడ్నాప్ వంటి ఘరానా నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ లిస్ట్‌ను ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్‌ చేశారు అక్కడి పోలీసులు. అయితే ఈ జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్న క్రిస్టఫర్‌ స్పాల్డింగ్‌ అనే నేరస్థుడు ‘మరి నా సంగతి ఏంటి?’ అని ఆ పోస్ట్‌పై కామెంట్‌ చేశాడు. అవునవును ‘నువ్వు చెప్పింది నిజమే… నీ మీదా రెండు వారెంట్లు పెండింగులో ఉన్నాయి.. నీ దగ్గరకే వస్తున్నామని రిప్లై ఇచ్చారు. అన్నట్లుగానే మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు. ‘నిన్ను పట్టుకోవడంలో నీ సహాయాన్ని అభినందిస్తున్నామని అతని ఫొటోతోసహా ఫేస్‌బుక్‌లో వ్యంగ్యంగా మరో పోస్ట్‌ పెట్టారు అమెరికా పోలీసులు. నేరస్థుల జాబితాలో లేనంత మాత్రాన వారి గురించి వెతకడం లేదన్న అర్థం చేసుకోవద్దంటూ పోలీసులు అంటున్నారు.

You cannot copy content of this page