తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతున్నారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లల్లో ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో ఇలాంటి వ్యభిచార ముఠాలు బయటపడుతున్నాయి. తాజాగా వ్యభిచార ముఠాపై పోలీసులు జరిపిన దాడుల్లో మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడు పట్టుబడ్డారు.
తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు ఓ వ్యభిచార గృహాంపై ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఓ మహిళా ఎస్‌ఐ తల్లి. తమ్ముడితో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు యువతులను రెస్క్యూ చేసి హోమ్‌కు తరలించారు. ఎస్‌ఐ తల్లితో పాటు తమ్ముడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మహిళా ఎస్‌ఐకి ఏడాది క్రితం పెళ్లి కావడంతో భర్తతో కలిసి ఉంటుంది. మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో ఆకస్మికంగా ఇంటిపై పోలీసులు దాడులు చేపట్టారు. సోమవారం రాత్రి జరిపిన దాడుల్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మహిళా ఎస్‌ఐ తల్లి, తమ్ముడు పట్టుబడ్డారని, వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.
నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ సురేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఒక విటుడిని కూడా అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇద్దరు యువతులను రెస్క్యూ చేశామని, వారి హోంకు తరలించినట్లు తెలిపారు. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కొంతమంది నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో దాడులు జరిపినట్లు తెలిపారు.