వాహనదారులూ త్రైమాసిక పన్ను చెల్లించండి

వాహనాల పన్నులు చెల్లించనట్టయితే భారీ జరిమానా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్..

దిశ దశ, మానకొండూర్ నియోజకవర్గం:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని రవాణా వాహన దారులు త్రైమాసిక పన్ను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుండి జరిపిన స్పెషల్ డ్రైవ్ లో త్రైమాసిక పన్ను చెల్లించని దాదాపు 700వాహనాలను సీజ్ చేయడమే కాక పన్ను తో పాటు 200% పెనాల్టి విధించామని,వీటి ద్వారా ప్రభుత్వానికి 1 కోటి 30 లక్షల ఆదాయం సమకూరిందని అన్నారు.అలాగే స్వచ్చందంగా దాదాపు 2000వాహన దారులు త్రైమాసిక పన్ను చెల్లించారని వీటి ద్వారా 1కోటి 50లక్షల ఆదాయం సమకూరిందని డిటిసి చంద్ర శేఖర్ గౌడ్ తెలియజేశారు.ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఇప్పటికీ పన్ను చెల్లించని వారు తక్షణమే స్వచ్ఛందంగా ఈ సేవ, మీ సేవల ద్వారా లేదా రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేసి పన్ను చెల్లించాలని లేని పక్షంలో తనిఖీల్లో పట్టు బడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 200% భారీ జరిమానా విధిస్తామని డిటిసి చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరించారు.

You cannot copy content of this page