రెండు తెలుగు రాష్ట్రాల్లో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వాసుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత ఈడీ కేసు గురించి చర్చ జరుగుతుంటే… ఏపీ ప్రజల్లో సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎపిసోడ్లు కూడా దేశ రాజధాని న్యూ డిల్లీ కేంద్రంగానే జరుగుతుండడం చర్చకు దారి తీస్తోంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఎవరెవరిని కలుస్తున్నారు..? ఆయన షెడ్యూల్ ఏంటీ అన్న విషయాలకంటే ఆయన వెన్నంటే తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గురువారం నుండి వైఎస్ జగన్ ను వీడకుండా ఉంటుండడమే ఇందుకు కారణం. రాత్రి సీఎం బస చేసిన వద్దే అవినాష్ రెడ్డి బస చేయడం, శుక్రవారం ఉదయం నుండి కూడా ఆయనతోనే కలిసి ఉంటండడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డి నిరాశ నిసృహలకు లోనవుతున్నారన్న ప్రచారం కూడా ఊపందుకోవడం గమనార్హం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్ప మిగతా ముఖ్యనాయకులతో కూడా అవినాష్ రెడ్డి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి అవినాష్ రెడ్డి ఎందుకిలా వ్యవహరిస్తున్నారోనన్నదే అంతు చిక్కకుండా పోయింది. అయితే ఇటీవల వైఎస్ వివేకానంద మర్డర్ కేసును సీబీఐ విచారించిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడిన అంశాలపై ఇబ్బంది పడుతున్నారా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.