సైబర్ క్రైం విషయంలో ముంబాయి పోలీసులు ఆరా నిజమే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో ఆర్థిక లావాదేవీలకు సంబధించిన వ్యవహారంలో ముంబాయి పోలీసులు గురువారం వచ్చి సోదాలు నిర్వహించారు. సాయంత్రం వరకు అనుమానితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ముంబాయి సైబర్ టీం ఎట్టకేలకు కొంతమందిని అదుపులోకి తీసుకుంది. ఈ విషయంలో పోలీసు వర్గాల నుండి వచ్చిన క్లారిటీ వివరాలను బట్టి… ముంబాయి ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీసులకు మార్చి నెలలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. కరీంనగర్ కు చెందిన ఓ బ్యాంకులో ఖాతా ఉన్నట్లు గుర్తించిన ముంబాయి పోలీసులు గురువారం కరీంనగర్ చేరుకొని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు లో మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంకు ఖాతాను సెక్రటరీ, ట్రెజరీలతో పాటు ఏడుగురి జాయింట్ అకౌంట్ తెరిచారు. ముంబాయి ఈస్ట్ రీజియన్ పోలీసులు సేకరించిన ఆ ఆధారాల ప్రకారం కరీంనగర్ చేరుకున్నారు. గురువారం అర్థరాత్రి వరకు సుభాష్ నగర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు, మరో మహిళ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఓ ట్రస్ట్ పేరిట వీరు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా విశ్వసనీయంగా సమాచారం అందుతున్నప్పటికీ… పోలీసు వర్గాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

You cannot copy content of this page