MLC Kodandaram: పీవీ జిల్లా కోసం నావంతు సహకారం ఉంటుంది: ఎమ్మెల్సీ కోదండరాం

దిశ దశ, హుజురాబాద్:

పివి జిల్లాపై ఎమ్మెల్సీ కోదండరాం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఎనిమిదేళ్లుగా అలుపెరగని పోరాటం సాహసంగా చేయాల్సి ఉందని అందుకు తన వంతు కృషి ఉంటుందని ప్రకటించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పీవీ జిల్లా అంటే ఖదరే ఉంటుదని, భూ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయన పేరిట జిల్లా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నూతన జిల్లాలేను అప్పటి ప్రభుత్వం అస్తవ్యస్తంగా విభజన చేసిందని, జిల్లాల ఆవిర్భావంలో ప్రభుత్వానికన్నా ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాల ఏర్పాటు కోసం ఓ కమిటీని ఏర్పాటు  చేయాల్సి ఉందన్న కోదండరాం ప్రజల మౌళిక సదుపాయలు, జీవన, ఆర్ధిక, బౌగోళిక అంశాలన్ని కూడా చర్చకు రావల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం ఓ జిల్లా లో రాజకీయం కోసం ప్రజలను, విద్యావంతులను ఉద్యోగులను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. హుజురాబాద్ సోషలిస్ట్ ఉద్యమకారులు, మేధావులు జన్మించిన గడ్డ అన్నారు.

బీఆర్ఎస్ పై ఆగ్రహం…

బీఆర్ఎస్ పార్టీ తీరును కూడా ఎమ్మెల్సీ కోదండరాం తప్పుపట్టారు. ప్రభుత్వంపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోందని, డబ్బులతో ఏమైనా చేస్తాం అన్న అహంభావం బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రజా స్వామ్య స్పూర్తితో పనిచేస్తామని, బీఆర్ఎస్ పార్టీ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ సంఘాలను చీల్చి ఘర్షణ వాతావరణం నెలకొనేలా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజాస్వామిక పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు జనసమితి మద్దతునిస్తుందని ప్రకటించిన కోదండరాం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మాత్రం విలీనం చేసే యోచన లేదని తేల్చి చెప్పారు.

You cannot copy content of this page