పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అనే వారు పెద్దలు. కానీ.. ఇప్పుడు తరాలు కాదు కదా కనీసం ఒక మనిషిని కూడా పూర్తిగా చూడకుండా పెళ్లి చేసేస్తున్నారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మంచోడా కాదా.. ఆరోగ్యంగా ఉన్నాడా లేదా ఇవేవి పట్టించుకోకుండా ముడి పెట్టి కొంత మంది ఆడపిల్లల గొంతుకొస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే నా భర్త మగాడు కాదు.. అసలు నాతో ఇప్పటి వరకు శారీరకంగా కలిసిందే లేదు. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఓ వివాహిత పోలీసులు ఆశ్రయించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝాట్ కపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. 2021 లో కొల్హాపూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రుడు లాంఛనాలు గట్టిగానే సమర్పించుకున్నారు. ఇక వివాహం అనంతరం భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిసిందే లేదు. అంతే కాకుండా భర్త రాత్రిళ్ళు పెళ్లి బట్టలు వేసుకుని, మేకప్ వేసుకుని ఫొటోలు దిగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు అమ్మాయిల కూడా ప్రవర్తించేవాడు. ఇక ఆ విషయమై యువతి అత్తమామలను ప్రశ్నించగా.. వాడికి చిన్నప్పటి నుంచి అలా అలవాటు. ఇప్పడు మార్చాలేము కదా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వీళ్ల చర్యలపై విసుగు చెందిన యువతి తన తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది. కొడుకు విషయం బయటకు వెళితే ఇంటి పరువు పోతుందని భావించిన అత్త ఇంటివారు అప్పటి నుంచి ఆ యువతిని శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా భర్త భార్య ప్రైవేట్ పాట్స్‌లో స్క్రూ డ్రైవర్ పెట్టి వేధించేవాడు. వీళ్ల వేధింపులు తట్టుకోలేని యువతి ఇటీవల పోలీసుకు ఫిర్యాదు చేసింది. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.