దిశ దశ, నిజామాబాద్:
జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు రీ ఓపెన్ చేస్తున్న అంశంపై మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేసిన ఆయన ఆ ఘటనలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే అప్పుడు ఈ కేసును క్లోజ్ చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. 21 ఏళ్ల తన కొడుకును ఇబ్బంది పెడుతున్నారని, తన కొడుకును ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని షకీల్ ఆరోపించారు. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కూడా పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారని, ఆ కేసులో తనను కూడా నిందితునిగా చేర్చారని, అప్పుడు తాను దుబాయిలో ఉన్నానని షకీల్ చెప్తున్నారు. తనతో శత్రుత్వం ఉందో లేక రాజకీయ శత్రుత్వమో కానీ 21 ఏళ్ల తన కొడుకు పట్ల అలా వ్యవహరించడం సరికాదన్నారు. హైకోర్టు ప్రోటెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తరువాత 41 సీఆర్సీసీ ఏ నోటీసు ఇవ్వకుండా గంటల తరబడి విచారణ చేస్తున్నారని ఆరోపించారు. టెర్రరిస్టును ఇంటరాగేట్ చేసిన విధంగా వ్యవహరిస్తున్నారని రాహిల్ ను ఎన్ కౌంటర్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. తన కొడుకు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించవచ్చని అంటున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కావాలని కక్ష్యగట్టడం మాత్రం సరైంది కాదంటున్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఏమంటున్నారో ఈ కింది లింక్ ద్వారా వినండి