హరీష్ నా టార్గెట్: మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, ఏపీ బ్యూరో:

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు లక్ష్యంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుమలలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి… ఆయన ఏ విధంగా రబ్బరు చెప్పులతో వెలమ హాస్టల్ కు వచ్చిన రోజు మర్చి పోయాడు… ట్రంకు డబ్బాతో వచ్చాడు. ఇవ్వాల ఏ స్థాయిలో ఉన్నడు హరీష్ రావు అవన్ని కూడా గమనించాలి… నూటికి నూరు పాళ్లు హరీష్ రావుకు బుద్ది చెప్తాను ఈ సారి అంటే నాకు టైం లేదు… మెదక్, మల్కాజ్ గిరిపై దృష్టి సారిస్తాను… తరువా సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తాని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. మైనంపల్లి హన్మంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు… హరీష్ రావు గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని వెంకటేశ్వరస్వామి పై ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నానంటూ ముగించారు.
మైనంపల్లి హన్మంతరావు మాట్లాడిన వీడియో….

You cannot copy content of this page