ఎన్ఎండీసీ సీఎండీగా నడిమెట్ల శ్రీధర్…

సింగరేణికి త్వరలో కొత్త సీఎండీ

నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గా సింగరేణి సీఎండి నడిమట్ల శ్రీధర్ నియామకం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఈ మేరకు శ్రీధర్ ను ఎన్ఎండీసీ సీఎండీగా నియమించాలని సిఫార్సు చేసింది. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీధర్ నడిమట్ల ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో పని చేశారు. మొదట రాజమండ్రి సబ్ కలెక్టర్ గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరక్టర్ గా కాకినాడలో, అనంతపూర్, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా మూడేళ్ల మూడు నెలల పాటు పని చేశారు. 2015 జనవరి 1 నుండి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుండి రిలీవ్ చేసిన తరువాత ఎన్ఎండీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీధర్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎండీని నియమించాల్సి ఉంది.

PESB సిఫార్సు చేసిన లేఖ

You cannot copy content of this page