BIG BREAKING: ఆస్పత్రికి చేరుకుంటున్న నందమూరి ఫ్యామిలీ

ఆసుపత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్… చంద్రబాబు

సినీ నటుడు నందమూరి తారకరత్న దగ్గరకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. తారకరత్నను పరామర్శించేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నేరుగా వైద్యులను అడిగి తెలుసుకునేందుకు ఎన్టీఆర్ కూడా బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరితో పాటు పులువురు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.

నందమూరి సుహాసినితో పాటు తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ కూడా నారాయణ హృదయాలయానికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్యం విషమించినట్లు డాక్టర్లు ప్రకటించడంతో.. బెంగళూరుకు సమీపంలోని ఆంధ్రా జిల్లాల నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు కూడా ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నందమూరి, నారా కుటుంబసభ్యులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇఫ్పటికే బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాలయ్య, ఇతర కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని, ఐసీయూలో ఎక్మో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని, గుండెకు రక్తం చేరడం లేదని తెలిపారు.

తారకరత్న ఆరోగ్యం విషమించిందనే వార్తల నేపధ్యంలో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తారకరత్నకు 10 మంది వైద్యుల బృందం ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాలయ్య నిన్నటి నుంచి హాస్పిటల్ లోనే ఉండి తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.

You cannot copy content of this page