దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులంతా కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే ప్రతిపాదించారు. బుధవారం సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో ఏన్డీఏ కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు నిర్ణయించారు. తమ మద్దతు ఏన్డీఏ కూటమికే ఉంటుందని కూడా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం న్యూ ఢిల్లీలోని ప్రధాని ఇంట్లో సమావేశం ముగిసిన అంనతరం ఈ మేరకు ఏన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ఏన్డీఏ కూటమిలో బీజేపీ ముఖ్య నాయకులతో పాటు టీడీపీ చీఫ్ నారా చంద్రబాాబు నాయుడు, జెడియూ నుండి నితీష్ కుమార్, రాజీవ్ రంజన్ సింగ్, సంజయ్ ఝా, ఎస్ హెచ్ఎస్ నేత ఏక్ నాథ్ షిండే, జెడి ఎస్ నేత హెచ్ డి కుమారస్వామి, ఎల్జేపీ (ఆర్వీ) పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్, హెచ్ఏఎం నేత జితన్ రాం మాజీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఎన్సీపీ నుండి సునీల్ ధాక్రే, ప్రఫుల్ పటేల్, ఏడి (ఎస్) నుండి అనుప్రియ పాటిల్, ఆర్ఎల్డీ జయంత్ చౌదరి, యూపీపీఎల్ నుండి ప్రమోద్ బోరో, ఏజీపీ తరుపున అతుల్ బోరా, ఎస్కేఎం నుండి ఇంద్ర హంగ్ సుబ్బా, ఏజెఎస్యూ సుదేష్ మహతోలు నరేంద్ర మోడీని ఏన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారు.