ప్రకృతి ప్రళయం…

దిశ దశ, కరీంనగర్:

మరోసారి ప్రకృతి ప్రళయం సృష్టించింది. పలు జిల్లాల్లో పట్టుమని పది నిమిషాలు కూడా వర్షం పడలేదు కానీ, ఐదు నిమిషాల పాటు గాలులు వీయలేదు కానీ జనజీవనం మాత్ర అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షం ఎఫెక్ట్ తో ప్రతి ఒక్కరూ అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు చెట్లు విరిగిపోయి రహదారులు కూడా ఎక్కడికక్కడ మూసుకపోయాయి. దీంతో మరోసారి సగటు పౌరుడు ప్రకృతి ప్రకోపంలో చిక్కుకపోయాడు. కరీంనగర్, రామగుండం రాజీవ్ రహదారిపై చెట్లు విరిగిపడి పోగా, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గర్రెపల్లి, జగిత్యాల జిల్లా కొండగట్టు, భీమారం ప్రాంతాల్లో చల్లబడ్డ వాతావారణం సామన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేసిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావంతో సామన్య జనం బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి తయారైంది. కరీంనగర్ మండలం చర్లబుత్కూర్, చాకుంట, కొండాపూర్ తో పాటు పలు గ్రామాల్లో వడగండ్ల బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోగా, వడగండ్లు కూడా పెద్ద ఎత్తున పడ్డాయి. వడగండ్ల కారణంగా పచ్చని పొలాలన్ని మంచు శకలాలతో నిడిపోయి తెల్లబోయాయి. జూబ్లీనగర్ లో రహదారికి అడ్డంగా చెట్టుపడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్దపల్లిలో…

పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతాంగాన్ని, సామాన్య జనజీవనానికి కష్టల్లోకి నెట్టేసింది అకాల వర్షం. పంట పొలాల్లోని వరి నేలకొరిగగింది. కరీంనగర్, రామగుండం రహదారిలోని పలు రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. గర్రెపల్లిలో పంటపొలాలతో పాటు ఇంటి పైకప్పులు లేచిపోవడంతో పాటు కొన్ని ఇండ్ల గోడలు కూలిపోయాయి. సుల్తానాబాద్ ప్రాంతంలోని పంట పొలాల్లో వడగండ్లు కురివడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జగిత్యాలలో…

జగిత్యాల జిల్లాలోనూ అకాల వర్షం అవస్థల్లోకి నెట్టేసింది. పంటపొలాలు దెబ్బతినగా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో తాటి చెట్టుపై పిడుగు పడడంతో ముంజలు విక్రయిస్తున్న గీత కార్మికుడు ముత్యం మల్లేష్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. భీమారం మండలం గోవిందారంలో పిడుగు పాటు కారణంగా 20 మేకలు చనిపోయాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షం

You cannot copy content of this page