బెంగుళూరులో కరెన్సీ గణపతి

దిశ దశ, బెంగుళూరు:

ఐటీ రాజధాని బెంగుళూరు నగరంలో వెరైటీ లంబోదరుడిని ప్రతిష్టించారు. వినూత్న ఆలోచనలతో నిర్వహాకులు సిద్దం చేసిన ఈ వినాయకుడు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిఫరెంట్ గా ఆలోచించిన నిర్వహాకులు ఎకో గణపతికి పూజలు చేయాలన్న ఆలోచనతోనే గత కొంతకాలంగా వివిధ రకాలుగా విఘ్నేశ్వరుడిని తయారు చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కరెన్సీ నోట్లు, నాణేలతో వినాయకుడి ప్రతిమను, ప్రాంగాణాన్ని తయారు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని బెంగుళూరు జేపీ నగర్ పుట్టెనహళ్లిలోని శ్రీ సత్య గణపతి ఆలయంలో కరెన్సీ వినాయకుడిని తయారు చేశారు. ఇందులో భారత దేశంతో పాటు ఇస్రో చేస్తున్న ప్రయోగాలకు సంబంధించిన చిత్రాలను కూడా రూపొందించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమతో పాటు మంటపం అంతా కూడా కరెన్సీ నోట్లతోనే అలంకారం చేయడం గమనార్హం. ఏటా ప్రత్యేకతతో కూడిన విఘ్నేశ్వరుడిని తయారు చేసే ఈ ఆలయ నిర్వహాకులు ఈ సారి కరెన్సీతో తయారు చేయించడంతో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంతో అంతా కూడా సెల్ఫీలు తీసుకునే వారితో కిక్కిరిసి పోతున్నది. ఇందు కోసం రూ. 10, 20, 50, 100, 200, 500 నోట్లను, వివిధ నాణేలను కూడా ఉపాయించారు. మొత్తంగా ఈ నవారత్రుల సందర్భంగా తయారు చేసిన ఈ వినాయకుడి కోసం రూ. 2.18 కోట్ల కరెన్సీ నోట్లు, రూ. 70 లక్షల విలువైన నాణేలను ఉపయోగించారు. అయితే ఈ వినాయకుడిని తయారు చేసేందుకు ఉపయోగించిన కరెన్సీ కానీ, నాణేలు కానీ భక్తుల నుండి సేకరించినవే కావడం విశేషం కాగా. ఉత్సవాలు ముగిసిన తరువాత ఏఏ భక్తులు అయితే ఆలయ నిర్వాహకులకు అప్పగించారో తిరిగి వారికే ఇవ్వనున్నారు. గతంలో పూలు, మొక్క జో్న్న, పచ్చి అరటి పండ్ల వంటి పర్యారణ పరిరక్షణకు దోహదపడే వాటితో వినాయక ప్రతిమలను తయారు చేసి పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

You cannot copy content of this page