దద్దరిల్లిపోతున్న దండకారణ్యం

దిశ దశ, దండకారణ్యం:

మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతోంది. అటు మావోయిస్టుల కార్యకలాపాలు ఇటు పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ల నడుమ ప్రశాంతంగా ఉన్న అడవుల్లో తుపాకుల మోతలు మారు మోగుతున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల ఎదురు కాల్పులు ఘటనలు చోటు చేసుకోగా ఓ చోట బస్సును దగ్దం చేశారు నక్సల్స్. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మౌజా, తోడఘట్ట వద్ద నక్సలైట్లు భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకున్నారని, మెరుపు దాడులకు సంబంధించిన స్కెచ్ వేయడంలో భాగంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు సి60 బెటాలియన్ జవాన్లు అటవీ ప్రాంతంలో మోహరించి కూంబింగ్ ఆఫరేషన్ చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మౌజా, తోడఘట్ట అటవీ ప్రాంతంలోని ఓ గుట్టపై సుమారు 60 నుండి 70 మంది మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఆ ప్రాంతానికి చేరుకున్న సి60 బెటాలియన్ పై నక్సల్స్ అత్యంత ఆధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారు. 30 నుండి 45 నిమిషాల పాటు సి60 బెటాలియన్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోగా నక్సల్స్ ఘటనా స్థలం నుండి అటవీ ప్రాంతంలోకి వెల్లిపోయారు. మావోయిస్టుల వైపు నుండి కాల్పులు నిలిచిపోయిన తరువాత మావోయిస్టుల డెన్ ఏరియాలోకి ఎంటర్ అయిన సి60 జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో ఒక మావోయిస్ట్ మృతదేహం లభ్యం కాగా అతను సమీర్ అలియాస్ సాధు లింగ మోహన్ (31)గా జావాన్లు గుర్తించారు. ఎన్ కౌంటర్ మృతునిపై 2018 లో భామ్రాఘడ్ పోలీసులపై మెరుపుదాడి చేసిన కేసుతో పాటు మొత్తం నాలుగు కేసులు ఉన్నాయని గడ్చిరోలి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుండి 1 కంట్రీ మేడ్ రైఫిల్, 1 భర్మార్ రైఫిల్, 303 రైఫిల్ ఒకటి, 2 మ్యాగజైన్‌లు, 30 రౌండ్ల SLR రౌండ్లు, ఇతరాత్ర ఆయుధాలతో పాటు ఓ ల్యాప్ ట్యాప్ మందుగుండు సామాగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వివరించారు మరో వైపున చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులకు, కూంబింగ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ ఘటనను దృవీకరించలేదు. మరో వైపున దండకారణ్య అటవీ ప్రాంతలో ఓ బస్సును నక్సల్స్ కాల్చివేశారు.

You cannot copy content of this page