డంప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టుల ఏరివేత కోసం భారీ వర్షాల్లోనూ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల సేఫ్టీ జోన్ లోకి కూడా బలగాలు చొచ్చుకపోయి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున దట్టమైన అటవీ ప్రాంతంలోకి బలగాలు చేరుకున్న క్రమంలో అప్రమత్తమైన నక్సల్స్ అక్కడి నుండి వెల్లిపోయారు. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా గోగుండ, సిమ్మెల్ కోర్ జోన్ లో బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. నక్సల్స్ డెన్ వద్దకు చేరుకునేందుకు 30 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెల్లిన కూంబింగ్ బలగాలను గమనించిన మావోయిస్టులు షెల్టర్ జోన్ నుండి తప్పించుకుని వెల్లిపోయారు. డిస్ట్రిక్ట్ ఫోర్స్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, 206 కార్ప్స్ కోబ్రా, 74 కార్ప్స్ CRPF బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. జిల్లాలోని కేరళపాల్ ఏరియా కమిటీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయన్న సమాచారం అందుకోవడంతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు. శుక్రవారం జిల్లాలోని నక్సల్స్ కోర్ ఏరియా, గ్రామం గరం, కొత్తపల్లి, నాగారం, నెడుం, తోయపర, సిమెల్, గోగుండ, డోగిన్‌పర తదితర గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించుకుంటూ బలగాలు ముందుకు సాగాయి. శనివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో గోగుండా, సిమెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో భద్రతా బలగాల ఉనికిని గమనించిన మావోయిస్టులు తమ షెల్టర్ జోన్ నుండి తప్పించుకుని వెల్లిపోయారు. మావోయిస్టుల డెన్ వద్దకు చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. అక్కడి నుండి 12 బోర్ గన్ 1, BGL లాంచర్ గన్ 1, 315 బోర్ సింగిల్ షాట్ గన్ 2, BGL బాంబ్ 8, బోర్ గన్ రౌండ్ 6, 315 బోర్ గన్ రౌండ్లు 8, కార్డెక్స్ వైర్, షూ, డ్రెస్ మెటిరియల్ తో పాటు పలు రకాల వస్తువులను, క్లాత్ ను రికవరీ చేశారు.