ఎన్డీఏ అంటే…?: సరికొత్త భాష్యం చెప్పిన కేసీఆర్

ఎన్డీఏ అంటే సరికొత్త భాష్యం చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు ఎన్డీఏ అంటే వివిధ రకాల ఫుల్ ఫామ్స్ మాత్రమే ఉండగా తాజాగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగంతో ఎన్డీఏ అంటే ఏంటో సరికొత్త రీతిలో వివరిస్తూ విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న క్రమంలో ఆయన విరుచకపడ్డ తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఆర్థిక వైఫల్యాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే ఇందులో ఎన్డీఏ అంటే ఆయన ఇచ్చిన వివరణతో అసెంబ్లీలో సభ్యులంతా కూడా ఘెల్లుమని నవ్వుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏ వివరాలు అడిగిన లేవంటూ సమాధానం చెప్తున్న తీరును తనదైన స్టైల్లో విమర్శించిన కేసీఆర్ ఓ రకంగా కమలనాథులను డిఫెన్స్ లో పడేశారని బీఆర్ఎస్ వర్గాలు కామెంట్ చేస్తున్నారు.

NDA… అంటే ఇదే…

ఇప్పటి వరకు భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో ఏర్పడిన కూటమిని ఎన్డీఏ అని పిలుస్తున్నారు. అంటే National Democratic Alliance (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) అని ఈ కూటమికి పేరు పెట్టారు. ఈ కూటమితో జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు నెరిపిన కమలనాథులు వరసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ ఉవ్విళ్లూరుతున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయని చెప్పొచ్చు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆవిర్భావం చేసిన ఆయన జాతీయ అంశాలనే ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఎన్పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్లు మాఫీలు, 20 లక్షల కోట్టు ఎంఎస్ఎల్ కు మాఫీ చేశామని చెప్పారని, కరోనా వివరాలు అడిగినా ఇదే పరిస్థితి నెలకొందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సంబందిత శాఖల అధికారులు, మంత్రులు, కేంద్రంలోని ఎవరిని అడిగినా సమాచారం మాత్రం దొరకడం లేదన్నారు. ఎన్డీఏ అంటే No Data Available (నో డాటా అవలైబుల్) అన్నట్టుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఏన్డీఏకు ఇప్పటి వరకు ఉన్న ఫుల్ ఫాం కాకుండా సీఎం కేసీఆర్ చేసిన కొత్త ఫుల్ ఫాం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి పార్టీల పనితీరును కేసీఆర్ విమర్శించిన తీరు కొత్త ఆలోచనలకు తెరలేపినట్టయింది.

You cannot copy content of this page