భద్రాద్రి సీతమ్మకు నేతన్న చీర

అద్భుతంగా నేసిన నేతన్న

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

అద్భుత కళా నైపుణ్యానికి కేరాఫ్ సిరిశాల. అగ్గిపెట్లే, దబ్బనం వంటి వాటిల్లో ఇమిడే చీరలు నేసిన నేతన్న ఘనత సిరిసిల్ల సొంతం. తాజాగా భద్రాద్రిలో జరగనున్న కళ్యాణమహోత్సవానికి సీతమ్మకు పట్టు పీతాంబరం నేసి పంపించాడు ఇక్కడి నేతన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది హరిప్రసాద్ 20 రోజుల పాటు శ్రమించి నేసిన చీరను భద్రాద్రి సన్నిధానానికి తరలించారు. 750 గ్రాముల బరువు ఉన్న ఈ పట్టు పీతాంబరంలో 150 గ్రాముల వెండి, పట్టుదారంతో నేసినట్టు నేతన్న హరిప్రసాద్ వివరించారు. చేనేత మగ్గంపై ఎంతో శ్రమించి నేసిన ఈ చీరను భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవంలో సీతమ్మకు అలంకరించాలని తయారు చేసినట్టు తెలిపారు. తాను నేసిన పట్టు పీతాంబరాన్ని భద్రాద్రికి చేరవేయాలని మంత్రి కేటీఆర్ ను హరిప్రసాద్ అభ్యర్థించగా ఇందుకు సరేనన్న మంత్రి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పట్టు పీతాంబరాన్ని అధికారులు భద్రాద్రి ఆలయానికి తరలించారు. ఈ సారి తన చేతుల్లో తీర్చిదిద్దిన పట్టు పీతాంబురం సీతమ్మ ధరించే అవకాశం రావడం ఆనందంగా ఉందని హరిప్రసాద్ అన్నారు.

You cannot copy content of this page