దిశ దశ, హైదరాబాద్:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ముగిసింది. లాస్య నందిత సోదరి నివేదితను క్యాండెట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి లాస్య నందిత గెలవగా ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఖాలీ ఏర్పడింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదితను ఖరారు చేశారు. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా సాయన్న ప్రాతినిథ్యం వహించగా ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికల్లో కూడా సాయన్న మరో కూతురు నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒకే కుటుంబం నుండి వరస ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒకే పార్టీ తరుపున పోటీ చేయడం విశేషం.