తెలంగాణలో కొత్త పార్టీలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బహుముఖ పోటీ తప్పదని స్పష్టమవుతుంది. తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీలు కన్నేసి ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మునిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా వివిధ పార్టీలు పావులు కదిపేందుకు సమాయత్తం అయ్యాయి. దాదా ఇప్పుడు అన్ని పార్టీలు టార్గెట్ తెలంగాణ అన్న రీతిలో దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆయా పార్టీల ఎంట్రీతో కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కానున్నాయి. ఇప్పటికే ఇక్కడ వేళ్లూనుకున్న అధికార టీఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీలతో పాటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, బి ఎస్ పి పార్టీల తరఫున అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలున్నాయి. ఆయా పార్టీలు ఇప్పటికే బలమైన అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న క్రమంలో పట్టుకోసం వివిధ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

బీజేపీ సీరియస్ స్కెచ్..

ఇప్పటివరకు ఒకటి అరా సీట్లతో సర్దిపెట్టుకున్న బిజెపి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించి అధికార టీఆర్ఎస్ పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. హిందుత్వ నినాదమే ఎజెండాగా దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ ని పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా రాష్ట్ర అధ్యక్షున్ని చేసిందని తెలుస్తోంది. రెండోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అనుకున్న సంజయ్ పాదయాత్రతో ప్రజలతో మమేకమైన అందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు కూడా తమకు లభిస్తుందని లాభయిస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారిన బిజెపి అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తూనే అధికార టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీసే వ్యూహాలకు పదును పెట్టింది. అవినీతి అక్రమాలను ఆసరాగా తీసుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరుకునపెట్టే ప్రయత్నాల్లో బిజెపి మునిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థలు ఈడి, ఐటీలు టిఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని పరోక్షంగా ఇరుక్కున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ బాహాటంగానే జరుగుతోంది. దీనివల్ల టిఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడర్షిప్ లో ఒక రకమైన గందరగోళం నెలకొంటుందని, సెకండ్ క్యాడర్
నాయకులకు ప్రధాన నాయకత్వంపై నమ్మకం తగ్గిపోతుందని, సెకండ్ లీడర్ షిప్ పై గ్రౌండ్ లెవెల్ క్యాడర్ క విశ్వసనీయత లేకుండా పోతోందని బిజెపి అంచనా వేస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరోవైపున సంఘ్ పరివార్ కూడా తన మార్కు సమీకరణాలకు శ్రీకారం చుట్టింది. సంఘంతో అనుబంధం ఉన్న కుటుంబాలు వారి వివరాలను సేకరించి బిజెపి పటిష్టత కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునేందుకు సంఘ్ ప్రచారకులు, ఫుల్ టైమర్లు సీరియస్ గా పావులు కలుపుతున్నారు.

టీడీపీ వ్యూహం

తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించిన టిడిపి ఇప్పుడు ఉనికే లేకుండా పోయిందన్నది వాస్తవం. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ తో పాటు ఒకటి రెండు జిల్లాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నా వారంతా టిఆర్ఎస్ వైపు చూడడంతో టిడిపి పూర్తిగా వీక్ అయిపోయింది. 2018 ఎన్నికల్లో కూడా ఒకటి రెండు స్థానాలు దక్కించుకున్న టిడిపి వారిని కాపాడుకోవడంలో విఫలమైంది. అయితే ఈసారి పకడ్బందీ వ్యూహంతో రాష్ట్రంలో పట్టు బిగించాలన్న లక్ష్యంతో అధినేత చంద్రబాబు పావులు కలుపుతున్నారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై.. పై చేయి సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన అస్త్రాలకు పదును పెట్టారు టిఆర్ఎస్ లో చేరి అసంతృప్తిగా ఉన్న పూర్వ టిడిపి నాయకులను తన పార్టీ వైపు మళ్ళించుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో వీలైనన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారో అక్కడ సామాజిక వర్గ సమీకరణాలు చేస్తూ గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.

వైస్సార్ టీపీ

ఇక వైయస్సార్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ మెట్టినింటి బిడ్డనంటూ రాష్ట్రంలో తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో మునిగింది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల టిఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది. షర్మిల ఎక్కడ పాదయాత్ర చేపట్టినా అక్కడ టిఆర్ఎస్ కౌంటర్ చర్యలకు దిగుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సంగారెడ్డి పెద్దపల్లి వరంగల్ జిల్లాల్లో షర్మిలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చర్యలకు పూనుకున్నారు. అయితే షర్మిల తన చరిష్మా కాకుండా తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ప్రజల్లోకి వెళ్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్టీపి తరఫున అభ్యర్థులను అన్ని స్థానాల్లో నిలబెట్టే పరిస్థితి లేకున్నప్పటికీ తన పట్టు చూపించాలన్న ప్రయత్నాల్లో మాత్రం షర్మిల నిమగ్నమైంది. పార్టీని బలోపేతం చేస్తూ ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి అయితే షర్మిల ముందు ఉన్న సవాలేనని చెప్పాలి. భవిష్యత్తులో షర్మిల ఎలాంటి స్కెచ్ తో తన బలాన్ని ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదు కానీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను వారి తలరాతలను మారుస్తుందా లేదా అన్నది తేలాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.

బీఎస్పీ ఎత్తులు..

బహుజనవాదంతో ప్రజాక్షేత్రంలో బలం నిరూపించుకునే బి ఎస్ పి ఇప్పుడు తెలంగాణలో తన బలాన్ని గలాన్ని ప్రాక్టికల్ గా చూపించే ప్రయత్నంలో మునిగిపోయింది. అధినేత్రి మాయావతి తెలంగాణ ఇన్చార్జిగా ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బాధ్యతల అప్పగించి రానున్న ఎన్నికల్లో తెలంగాణపై తన లక్ష్యమేంటో చెప్పకనే చెప్పింది. నక్సల్స్ ఏరివేతతో పాటు ప్రజలతో మమేకం కావడంలో బిఎస్పి స్టేట్ ఇంచార్జ్ గా భాద్యతలు చేపట్టిన ఆర్ ఎస్ పి సక్సెస్ అయ్యారన్న పేరుంది. అంతేకాకుండా గురుకులాల కార్యదర్శిగా పలు సంస్కరణలు చేపట్టిన ఆర్ఎస్పి తన సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. స్వైరోస్ పేరిట ప్రత్యేక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న ప్రవీణ్ కుమార్ తన గ్రౌండ్ వర్క్ కు ఈ సంస్థను కీలకంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. నక్సల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో కూడా వారికి పట్టున్న ప్రాంతాల్లో ప్రజలను మచ్చిక చేసుకొని సక్సెస్ బాటలో నడిచిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే వ్యూహాలతో రాజకీయ సమీకరణాలు జరపనున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల నాటికి బీఎస్పీని బలమైన శక్తిగా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జనసేన..

ఇంతకాలం ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన తెలంగాణలో కూడా ఎంట్రీ ఇస్తానని ప్రకటించింది. అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన సత్తా ఏంటో చూపిస్తానని రానున్న ఎన్నికల్లో ఇక్కడ కూడా జనసేన అభ్యర్థులను పోటీ చేయిస్తుందని వెల్లడించారు. దీంతో జనసేనాని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నం అయినట్టు స్పష్టం అవుతోంది.

మాజీ ఐఏఎస్..

ఇకపోతే మరో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా సొంత పార్టీ పెడతానని ప్రకటించారు. విద్యా విధానం విషయంలో ప్రభుత్వాల తీరును ఎండగట్టిన మురళి వైవిద్యంగా వ్యవహరిస్తారు. దళిత బహుజన వర్గాల పై జరుగుతున్న వివక్షను ఏకీపారేయడంలో మురళీ వెనుకడుగు వేయారు. ఇదే కారణంతో ఆయన తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఆకునూరి మురళి కూడా సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రకటించడంతో ఆయన ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఆయా రాజకీయ పార్టీలు తెలంగాణ ముఖచిత్రాన ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వాటిని నేపథ్యం ఏంటి అన్న చర్చ కన్నా వాటి బలాబలాలు ఎలా ఉంటాయి అన్న అంశం కన్నా అవి ఏ పార్టీ పతనాన్ని శాసిస్తాయోనన్న చర్చే తెలంగాణ వ్యాప్తంగా సాగుతోంది.

You cannot copy content of this page