తెలంగాణ ‘జూడా’ల సరికొత్త ప్రతిపాదన…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణాలో ఈ సారి డాక్టర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఏనాడు లేని విధంగా ఈసారి అసెంబ్లీకి 15 మంది డాక్టర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ డాక్టర్లకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఓ లేఖను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఈ సారి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను ఎమ్మెల్యేలుగా గెలిచిన డాక్టర్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని ‘జూడా’లు కోరుతున్నారు. డాక్టర్ అయితే వైద్య వ్యవస్థపై సంపూర్ణమైన అవగాహన ఉంటుందని, దీనివల్ల వైద్య ఆరోగ్య శాఖకు సరైన న్యాయం చేస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. వైద్య రంగంలో ఉన్న వారిని ఎంపిక చేసినట్టయితే అటు రోగుల పరిస్థితి ఇటు డాక్టర్ల విధుల గురించి పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందన్న విషయాన్ని గమనించి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు డాక్టర్ ఎమ్మెల్యేకు అప్పగించాలని అభ్యర్థిస్తున్నారు.

You cannot copy content of this page