దిశ దశ, కరీంనగర్:
కొత్త ఫీచర్లతో తయారు చేసిన మారుతి సుజికి న్యూ మోడల్ కారును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. కరీంనగర్ లోని మారుతీ షోరూంలో లాంఛింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. కరీంనగర్ వినియోగదారుల కోసం ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి ఎరినా షోరూంలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. నాల్గో జనరేషన్ కు చెందిన ద ఎపిక్ న్యూ స్విఫ్ట్ కారులో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆదర్శ సంస్థ ఎండీ బూరుగు సత్యనారాయణ గౌడ్ అన్నారు. జడ్ సిరిస్ ఇంజన్ (Z12E) ఏర్పాటు చేయడంతో మైలేజ్ ఎక్కువగా ఇస్తుందని వివరించారు. మాన్యూవల్ సిస్టంలో 24.80 కెంఎంపీఎల్ ఇస్తుందని, ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా అయితే 25.75 KMPL మైలేజ్ ఇస్తుందని సత్యనారాయణ గౌడ్ వివరించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్స్ ఏర్పాటు చేయడంతో పాటు 9 ఇంచుల టచ్ స్క్రీన్, వైర్ లెస్ ఛార్జర్, ఎల్ఈడీ ఫోగ్ లాంప్స్, రెర్ ఏసీ వెంట్స్, మూడు పాయింట్ సీట్ బెల్ట్, రిమైండర్ సుజుకి కనెక్ట్ ఉన్నాయని తెలిపారు. నయా ఫీచర్స్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ వెహికిల్ కరీంనగర్ కన్జ్యూమర్స్ కోసం తమ షోరూంలో అందుబాటులో ఉంటుందని సత్యనారాయణ గౌడ్ వివరించారు.