యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొత్త అప్ డేట్..జనవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ Eligible Test 2022 డిసెంబర్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ మొదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ పై క్లిక్ చేసి ugcnet.nta.nic.in పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇటీవల, UGC నెట్ పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీల గురించి వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31 నుంచి వీటికి దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

దరఖాస్తు ఫీజు

OBC అభ్యర్థులు ఫీజుగా రూ. 1100 చెల్లించాలి. అయితే EWS, OBC-NCL అభ్యర్థులు మాత్రం రూ. 550 ఫీజు చెల్లించాలిసి ఉంటుంది. SC , ST ,PWD అభ్యర్థులు రూ.275 ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

ఈ పరీక్షకు దరఖాస్తులు పెట్టుకోవడానికి 2023 జనవరి 17 తో ముగిసింది. కానీ తాజాగా ఈ అప్లికేషన్ల తేదీని మరో మూడు రోజులు పెంచారు.2023 జనవరి 21 నుంచి జనవరి 23 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

అప్లై చేసుకున్న అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి 2023 ఫిబ్రవరి రెండవ వారం నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను 2023 ఫిబ్రవరి 21 నుంచి 2023 మార్చి 10 వరకు నిర్వహిస్తుంది . పరీక్ష మూడు గంటలు జరుగుతుంది. మొత్తం రెండు షిఫ్టులలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. UGC NET పరీక్ష మొత్తం 83 సబ్జెక్టులకు CBT విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి.

You cannot copy content of this page