ఎన్ఐఏ సోదాలు: నలుగురు ఇసీస్ ఉగ్రవాదుల అరెస్ట్

దిశ దశ, జాతీయం:

దేశ వ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముప్పేట దాడులు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలోని 19 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా ఏజెన్సీ బృందాలు పెద్ద ఎత్తున తనిఖీలకు శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం నుండి జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక డాక్యూమెంట్లతో పాటు టెర్రర్ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. మరో వైపున నాలుగు రాష్ట్రాల్లో ఐదుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. అయితే ఇంకా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మరింతమంది టెర్రరిస్టులు, సంస్థలకు సంబంధించిన డాక్యూమెంట్లు లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

You cannot copy content of this page