బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానం…
దిశ దశ, జాతీయం:
రాజకీయాల్లో కూటములుగా ఏర్పడడం ఆయా రాష్ట్రాల్లో పట్టున్న పార్టీలు అధికారంలోకి రావడం సహజంగా జరుగుతుంటుంది. అయితే అక్కడ మాత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాయకుడు మాత్రం మిత్రపక్షానికే షాకిస్తూ ప్రత్యర్థులతో చేతులు కలుపుతుంటాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సార్లు రాజీనామా చేశారు… గంటల వ్యవధిలోనే తిరిగి బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే ఇలాంటి రికార్డు ఒక్క ఆయనకు మాత్రమే దక్కుతుంది కావచ్చు. బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ఎత్తులు పై ఎత్తులను గమనిస్తే సంచలనమే. సాధారణంగా ప్రతిపక్షాలు సమీకరణాలు మార్చి అధికారంలో ఉన్న వారిని గద్దె దింపే విధానం అంతటా జరుగుతుంది… కానీ బీహార్ లో మాత్రం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రే మిత్ర పక్షాలను మారుస్తూ అధికారంలో కొనసాగుతున్నారు.
ఎలక్ట్రికల్ ఇంజనీర్…
1951లో బీహార్ రాజధాని పాట్న సమీపంలోని ఓభక్తియార్ పూర్ లో నితీష్ కుమార్ జన్మించారు. ఆయుర్వేద వైద్యుడు కూడా అయిన ఆయన తండ్రి స్వాతంత్యద్యోమంలో పాల్గొన్నారు. ఒకప్పుడు బీహార్ ఇంజనీరింగ్ కాలేజీ… (పాట్నా ఎన్ఐటీగా పేరు మార్చారు)లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు నితీష్ కుమార్. స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే లలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ కుమార్ మోది వంటి ముఖ్య నేతలతో పరిచయాలు కావడంతో ఆయన రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించేందుకు అవకాశం చిక్కింది. మొదట వాజపేయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన నితిష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఒడిదొడుకుల నడుమ…
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితిష్ కుమార్ తొలిసారి ఒడిదొడుకులే ఎదుర్కొన్నారు. 1985లో తొలిసారి హర్నౌత్ నియోజకవర్గం నుండి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. లోక్ దళ్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమ నేపథ్యంలో జార్జ్ ఫెర్నాండేజ్, నితీష్ కుమార్ లు 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2000 సంత్సరంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఆ తరువాత నుండి జనతాదళ్ (యు) పార్టీని స్థాపించిన నితీష్ కుమార్ మిత్ర పక్షాల సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. 2005లో ముఖ్యమంత్రిగా ఆయన బీహార్ రాష్ట్రంలో శాంతి భధ్రతల నియంత్రణకు ప్రత్యేకంగా కృషి చేశారు. నేరమయంగా మారిన బీహార్ ను చక్కదిద్దే పనిని భుజనా వేసుకున్న ఆయన సఫలం అయిన తీరుపై అన్ని వర్గాల వారి అభినందనలు అందుకున్నారు. బీజీపీతో మిత్రపక్షంగా ఉంటూనే నితిష్ రాష్ట్రంలోని పస్మందా వర్గానికి చెందిన ముస్లింలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. 2013లో మిత్ర పక్షమైన బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ఆయన కాంగ్రెస్, సీపీఐతో చేతులో కలిపి ముఖ్యమంత్రిగా కొనసాగారు. లోకసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ తప్పుకోవడంతో తొమ్మిది నెలల పాటు జితన్ రాం మాంఝీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి అధికారంలోకి రాగా రెండేళ్ల పాటు ఈ పొత్తులు కొనసాగాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో మిత్రపక్షానికి బైబై చెప్పిన నితీష్ 2017లో ఎన్డీఏలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో ఓడిపోవడంతో తన ఓటమికి బీజీపీతో స్నేహమేనని భావించిన ఆయన 2022లో ఎన్డీఏను వీడి మహా కూటమితో చేతులు కలిపి 18 నెలల పాటు సీఎంగా కొనసాగారు. తిరిగి మళ్లీ బీజేపీకి స్నేహ హస్తం అందించి రాజకీయాలను నెరిపారు. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన నితీష్ కుమార్ మూడు రోజుల క్రితం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి నుండి వైదొలిగి సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ పంచన చేరి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దోస్తానా… కటిఫ్…
సీఎం నితీష్ కుమార్ మిత్ర పక్షాలతో జట్టుకట్టడం కొంతకాలం తరువాత వారికి షాకిచ్చి మరో పక్షంతో చేతులు కలపడం సాధరణం అయిపోయింది. బీహార్ లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠతను రేకెత్తించిన సందర్బాలు ఎన్నో ఎదురైనా చివరకు ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమార్ కావడం గమనార్హం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆయన మొదట రైల్వై విభాగంలో పనిచేశారు. అయితే ఆయన పొందిన డిగ్రీ పట్టాకు తగ్గట్టుగానే మిత్రపక్షాలకు షాక్ ఇస్తున్నారు నితీష్ కుమార్.