మార్కెట్లో నిసాన్ కార్లకు ఉన్న డిమాండ్ మరే కార్లకు లేదు. త్వరలోనే నిసాన్ UV ప్రొడక్ట్ మన ముందుకు రానుంది. జపాన్ కంపెనీ ఈ కారుకు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను బయటకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్ టెస్టింగ్ దశలో ఉంది . నిసాన్ ఎక్స్ ట్రేల్ నుంచి ఈ కార్ ప్రారంభించవచ్చు.
టొయోటా ఫార్చ్యూనర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా కొత్తగా డిజైన్ చేశారని టాక్. ఈ కార్ నిస్సాన్ ఎక్స్ ట్రేల్ వారి నుంచి లాంచ్ అవుతుందట.
అదే సమయంలో మనకి ఇంకో న్యూస్ కూడా చెప్పనుంది.. రీనాల్ట్ ట్రైబర్‌తో కలిసి నిస్సాన్ కంపెనీ కొత్తగా 7 సీటర్ కారును కూడా లాంచ్ చేస్తుందని తెలిసిన సమాచారం.
కొత్త నిసాన్ 7 సీటర్ కార్ Mpv గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే రీనాల్ట్ ట్రైబర్ కంపెనీతో కలిసి పవర్ ట్రేన్, ఫీచర్లను తీసుకోనుందని సమాచారం.దీనిలో 1.0 లీటర్ 3 సిలెండర్, నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ మోడల్ కార్ రానుంది. ఇది 71 BHP పవర్, 96 NM టార్క్ జనరేట్ చేస్తుంది. కొత్త MPV కార్ 7 సీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. రెండింట్లో మ్యాన్యువల్, AMT గేర్ బాక్స్ ఆఫర్ ఉన్నాయి. నిస్సార్ 7 సీటర్ MPV ధర మారుతి ఎర్టిగో కంటే ఈ కార్ ధర తక్కువగానే ఉంటుందని తెలుస్తుంది.