దిశ దశ, నిజామాబాద్:
వివాహేతర బంధం మత్తులో పడిపోయి మాతృత్వపు విలవలను మంటగలిపిన ఒకరికి శిక్ష పడింది. నిజామాబాద్ జిల్లా కోర్టులో నిందితురాలికి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఓ వివాహిత కొంతకాలంగా వివాహేతర బంధం పెట్టుకుని జీవనం సాగిస్తోంది. భర్త కుటుంబ పోషణ కోసం దుబాయికి ఉపాధి కోసం వెల్లడంతో వివాహేతర బంధం కొనసాగిస్తూ వచ్చింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న నాలుగేళ్ల కొడుకు గుండా నాగేంద్రను లేకుండా చేస్తే తమ వివాహేత బంధానికి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించవచ్చని భావించిన ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కడ తేర్చాలని స్కెచ్ వేసింది. 2020 నవంబర్ 12న జాకెట్ తో ఉరి వేసి చంపేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు హతురాలు కన్నతల్లేనని తేల్చి కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టుకు ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ప్రవేశపెట్టారు. పూర్వాపరాలను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా జడ్జి కె సునిత నిందితురాలికి జీవిత ఖైదీగా శిక్ష విధించడంతో పాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంతో పాటు నిందితులకు శిక్ష పడడంలో దర్యాప్తు చేసి సఫలం అయిన ఆర్మూర్ ఏసీపీ ఎం జగదీష్ చందర్, భీమ్ గల్ సీఐ ఎ వెంకటేశ్వర్లు, ఎర్గట్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మచేందర్ రెడ్డి, కానిస్టేబుల్ బి ప్రవీణ్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు. వీరికి ప్రత్యేకంగా రివార్డులు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
PRESS NOTE:
— Nizamabad Police (CP Nizamabad) (@cp_nizamabad) September 13, 2023
ఎర్గట్ల PS పరిధిలో నమోదైన https://t.co/eEEctFUEjE 62/2020 U/S 302, 201 IPC హత్య కేసులో నిందితురాలికి యావజ్జీవ జైలు శిక్ష విధించిన నిజామాబాద్ కోర్టు pic.twitter.com/m3CqGjIjbH