రామగుండం ఎయిర్ పోర్టు నిర్మాణం చేయలేం…

డెవలపర్స్ ముందుకు రాలేదు…

పెద్దపల్లి ఎంపీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి…

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేదని, గుట్టలు విస్తరించి ఉండడంతో పాటు…రామగుండం గగనతలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిషేధిత ప్రాంతం కాబట్టి రక్షణ శాఖ అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి కింజారపు రాంమోహన్ నాయుడు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయం నిర్మించేందుకు అనువైన ప్రాంతం ఉందని, బసంత్ నగర్ పరిశ్రమకు సంబంధించిన ఎయిర్ పోర్టు కూడా ఉన్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఎంపీ లేఖను పరిశీలించిన కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రత్యుత్తరం రాశారు. బసంత్ నగర్ వద్ద చిన్న హెలిప్యాడ్ తప్ప ఇతర మౌళిక సదూపాయాలు అందుబాటులో లేవని విమానాశ్రయం అభివృద్ది కోసం TEFR ఆధారంగా AAI బసంత్ నగర్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎత్తైన గుట్టలు విస్తరించి ఉన్నట్టుగా తేలిందని వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పరిధిలో ఉందని, ఎయిర్ ఫోర్స్ అకాడమి ఫ్లయింగ్ శిక్షణ కోసం రామగుండం ప్రాంత గగనతలాన్ని ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంది తెలిపారు. ఈ కారణంగా కేంద్ర రక్షణ శాఖ నుండి కూడా అనుమతులు తీసుకోవల్సిన అవసరం ఉంటుందన్నారు.

ఆ ప్రతిపాదనా రాలేదు…

మరో వైపున కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు (GFA)లను అభివృ‌ద్ది చేయాలని నిర్ణయించుకుందని కూడా వివరించిన కేంద్ర మంత్రి ఇందుకు సంబందించిన ప్రతిపాదనలు ఏవీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చేరలేదన్నారు. విమానశ్రయాలను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చినట్టయితే ఇందుకు అనువైన స్థలాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణానికి కావల్సిన క్లియరెన్సులు తీసుకుని ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటన్నింటిని తయారు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందని ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే 2008 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పాలసీ నిబంధనల ప్రకారం పరిగణిస్తామన్నారు.

You cannot copy content of this page