మంథని మునిసిపల్ లో అవిశ్వాస రాజకీయం

దిశ దశ, మంథని:

మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజకు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు కౌన్సిలర్లు. గురువారం పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి ఈ మేరకు కౌన్సిలర్లు దరఖాస్తు అందజేశారు. మునిసిపాలిటీలో మొత్త 13 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాసానికి 9 మంది సభ్యులు అనుకూలంగా సంతకాలు చేశారు. ఈ కాపీని నలుగురు కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు.

మెజార్టీ వారే…

అవిశ్వాసం కోసం 9 మంది కౌన్సిలర్లు అనుకూలంగా సంతకాలు చేయగా అందులో ఏడుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.  వీరంతా హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాస రాజకీయానికి తెరలేపారు. గత నెలలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గా ఉన్న పుట్ట మధుపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నించారు. కొంతమంది జడ్పీటీసీలను క్యాంపునకు తరలించినప్పటికీ కోరం లేకపోవడంతో అర్థాంతరంగా క్యాంపు ఎత్తివేయాల్సి వచ్చింది. ఆయన భార్య శైలజ ఛైర్ పర్సన్ గా ఉన్న నేపథ్యంలో ఆమెను గద్దె దింపాలని నిర్ణయించుకున్నారు. అయితే జడ్పీ ఛైర్మన్ అవిశ్వాసం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ సారి కట్టుదిట్టమైన వ్యూహంతో ఎత్తులు వేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ సమీకరణాలు మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈరోజు  కార్యరూపం దాల్చింది.

You cannot copy content of this page