ప్రస్తుతం నరేశ్, పవిత్ర లోకేష్ పెళ్లి ముచ్చట్లు సోషల్ మీడయాను షేక్ చేస్తున్నాయి. 2023లో తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరు షాకయ్యారు. అంతే కాకుండా వారిద్దరు లిప్ కిస్ పెట్టుకుంటూ వీడియో షేర్ చేయడంతో వీరిపై జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.
ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను నరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆయన్ను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా వారిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది… ఆయనకు చాలామందితో ఎఫైర్స్ ఉన్నాయని, ఈ విషయం గురించి నాకు ఎన్నో సార్లు క్షమాపణలు చెప్పాడు. మారుతాడు అనుకున్నా కానీ ఇంత దారుణంగా మారిపోతాడనుకోలేదు. మరో పెళ్లి చేసుకున్న ఆయనకు నేను ఎట్టి పరిస్థితిల్లోనూ విడాకులు ఇవ్వను. ఎందుకంటే మా ఇద్దరికి ప్రతిరూపంగా ఓ కొడుకు ఉన్నాడు, మేం విడిపోవడం వాడికి అస్సలు ఇష్టం లేదు. ఆ వీడియో చూసినప్పటి నుండి నా కొడుకు చాలా మానసికంగా కుంగిపోతున్నాడు. వాని ఫ్రెండ్స్ చాలా ఎగతాళిగా మాట్లాడుతుండడంతో తట్టుకోలేకపోతున్నాడు. ఇవన్నీ నేను భరించలేను. అస్సలే నేను నరేశ్‌కు విడాకులు ఇవ్వను. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రమ్య రఘుపతి. పవిత్రతో నూతన జీవితాన్ని ఆరంభించిన నరేష్ మూడో భార్య అభిప్రాయ విని ఎలా స్పందిస్తాడోనన్న డిస్కషన్ టాలివుడ్ లో జోరుగా సాగుతోంది.