లోకసభలో ఆ నెంబర్ గల్లంతు…

చరిత్రలోనే ఆ సంఖ్యకు అవకాశం ఇవ్వని వైనం..

దిశ దశ, న్యూ ఢిల్లీ:

వరస క్రమంలో నెంబర్లు ఉండడం సహజం. నెంబరింగ్ సీరియల్ తప్పితే లెక్క తేలదని వరస క్రమంలో నెంబర్లు చెప్తుంటాం. అయితే అక్కడ మాత్రం ఆ నెంబర్ కు అవకాశం లేకుండా పోయింది. బ్రిటిష్ కాలం నాటి ఆ భవనంలో ఎందుకు ఆ నెంబర్ లేకుండా జాగ్రత్త పడ్ఖారో తెలుసా..?

ఐపీసీ ఎఫెక్ట్…

ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఎఫెక్ట్ కారణంగానే ఈ నెంబర్ లేకుండా అప్పటి నేతలు జాగ్రత్త పడ్డారట.543 స్థానాలున్న భా‌రతదేశ చట్టాలను తయారు చేసే లోకసభలోనే ఈ ఓ నెంబర్ లేకపోవడం ఏంటా అని అనుకోకండి. అక్షరాల ఇది నిజం… ఐపీసీ సెక్షన్ ప్రకారం… మోసం చేసిన వారిపై ఛీటింగ్ కేసు నమోదు చేయడం సహజం. ఈ కేసులో నిందితులపై 420 ఛీటింగ్ కేసు నమోదు చేస్తారు. దీంతో మోసగాళ్లను 420 అని పిలిచే సాంప్రదాయం కూడా ఉంది. దీంతో ఈ నెంబర్ ను అక్కడ పిలవకూడదన్న ఆనవాయితీ స్టార్ట్ అయింది.

ఏ నెంబర్ మరీ…

419 వరకు వరస తప్పకుండా నెంబర్లు ఉన్నప్పటికీ లోకసభలో 420 సీరియల్ నెంబర్ కు అవకాశం ఇవ్వలేదు. 419 తర్వాత 420కి బదులుగా 329ఏగా కౌంట్ చేసి ఆ తర్వాత 421కి అవకాశం ఇచ్చారు. 420 అనగానే ఆ ఎంపీ అందరి దృష్టి ఆకర్షిస్తారని, అందరూ ఆయన్ని అలాగే పిలిస్తే గిల్టీ ఫీలింగ్ ఉంటుందని ఈ నెంబర్ కు అవకాశం ఇవ్వలేదు. ఇది లోకసభలో ఈ నెంబర్ లేకుండా ఉండడానికి అసలు కారణం.

You cannot copy content of this page