వెనుదిరిగిన డీఎంహెచ్ఓ
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏకంగా ఓ జిల్లా వైద్యాధికారికే అనుమతి లేకుండా పోయింది. లోపలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆయన సిబ్బందిని తీసుకుని వెనక్కి వెళ్లిపోవల్సి వచ్చింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు వర్చువల్ విధానంతో మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లోని మెడికల్ కాలేజీల్లో సంబంధిత జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా హాజరు కావల్సి ఉంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో కూడా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ రావుతో పాటు సుమారు 200 మంది వైద్య సిబ్బంది కూడా మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అనూహ్యంగా పోలీసులు డీఎంహెచ్ఓ ను అనుమతించకపోవడంతో ఆయన ప్రారంభోత్సవానికి హాజరు కాకుండానే వెనుదిరిగారు.