ఆ టీషర్టుతో వస్తే నో ఎంట్రీ… కరీంనగర్ జడ్పీలో విచిత్రం

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ టర్మ్ లో చిట్టచివరి సమావేశం కావడంతో డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జడ్పీ సభ్యుడు శ్రీరం శ్యాం నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించాడు. రెండో విడుత దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ తన టీ షర్ట్ పై నినాదాలు రాయించుకుని సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ టీషర్టుతో మీటింగ్ హాల్ లోకి వెళ్లవద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు సమావేశం ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ తనిఖీ కేంద్రం ముందు నిల్చుండిపోయారు. గత ప్రభుత్వం మోడల్ నియోజకవర్గంగా హుజురాబాద్ ను ఎంపిక చేసి దళితులకు రూ. 10 లక్షల సాయం అందించిందని, అయితే రెండో విడుత నిధుల డ్రాకు ఉన్న ఫ్రీజింగ్ ను ఎత్తి వేయాలని శ్రీరాం శ్యాం డిమాండ్ చేస్తున్నారు. తాను ప్రజా స్వామ్య బద్దంగా చేస్తున్న డిమాండ్ ను టీ షర్టుపై రాయించుకుని వచ్చినందుకే జడ్పీ మీటింగుకు అటెండ్ అయ్యేందుకు ఆహ్వానించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే తనను అడ్డుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదని వ్యాఖ్యానించారు. టీషర్టులపై డిమాండ్లను ప్రదర్శిస్తూ లోకసభ, శాసనసభల్లోకి సభ్యులు వెల్లిన సందర్భాలు ఉన్నప్పటికీ కరీంనగర్ జడ్పీ మీటింగుకు మాత్రం నో ఎంట్రీ చెప్పడం ఏంటో అర్థం కావడం లేదని శ్యాం వాపోయారు. దళితుల వాయిస్ సభలో వినిపించేందుకు అర్హత లేనట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో అదికారులకే తెలియాలన్నారు.

పేరు మార్చుకున్నా సరే: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

మరో వైపున సభకు హాజరైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. నియోజకవర్గంలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదని దీంతో డెలివరీలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చుకున్న మంచిదే కాదని పథకాన్ని అమలు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి అయ్యే వారిని ప్రోత్సహించాలని కౌశిక్ రెడ్డి సూచించారు. హుజరాబాద్ ఆసుపత్రిలో సిద్దంగా ఉన్న ఐసీయూ సేవలను వినియంలోకి తీసుకరావాలని, గత ప్రభుత్వ హయాంలోనే దీనిని సిద్దం చేశారని అన్నారు. డాక్టర్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నందున డెలివరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వెంటనే హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page