నో నెంబర్… నో ఎంట్రీ…

రాష్ట్రంలో తోలిసారి ప్రయత్నం

వేములవాడ రాజన్న క్షేత్రంలో స్టార్ట్

అసాంఘీక కార్యకలాపాలకు ఇక చెక్

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్కడి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పట్టుకోవడం ఫైన్లు వేయడంతో సరిపెట్టినా లాభం లేదనకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారంతా కూడా నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లోనే తిరుగుతున్నారన్న విషయాన్ని పసిగట్టారు. అంతే సరికొత్ వ్యూహానికి పదును పెట్టిన వేములవాడ పోలీసులు నేరగాళ్లను నియంత్రించంతో పాటు ఎంవీ యాక్టును ఖచ్చితంగా అమలు చేసే విధానంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పోలీసులు.

వెహికిల్ పేపర్స్ గురించి ఆరా
నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్

ఎందుకిలా…?

నో నెంబర్… నో ఎంట్రీ అన్న నినాదంతో వేములవాడ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం వింతగా ఉన్న వెనక ఉన్న మూల కారణాలు తెలిస్తే ఆశ్యర్యపోకమానరు. ఎంవీ యాక్టు అమలు చేస్తున్న క్రమంలో తరుచూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువగా తారసపడుతున్నాయి. వాటికి ఫైన్లు వేసి పోలీసులు వదిలేస్తుండడంతో వాహనదారులు మాత్రం నెంబర్ ప్లేట్ వినియోగించడం లేదు. అయితే పోలీసులు అమలు చేసే ఎంవీయాక్టు వల్ల వందల్లో పడుతున్న ఫైన్ కట్టుకుని వెల్లిపోతున్న వారిలో నేరాలతో సంబంధాలు ఉన్న వాళ్లూ ఉండోచ్చు, సాధారణ పౌరులూ ఉండొచ్చు. కానీ వారిని గుర్తు పట్టడం ఇబ్బందికరంగా మారుతోంది పోలీసులకు. ఎంవీ యాక్టు అమలు చేస్తున్న క్రమంలో త్వరితగతిన వాహనదారుల నుండి ఫైన్ వసూలు చేసి పంపించడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. దీంతో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆద్వర్యంలో పోలీసులు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. పేదల దేవుడిగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. రద్దీగా ఉండే క్షేత్రంలో చిల్లర దొంగలు, చైన్ స్నాచర్స్ తో పాటు ఇతరాత్ర నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో వీరిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలతోనే అసలు సమస్య వస్తోందని గుర్తించారు. ఇక నుండి రాజన్న ఆలయంలో నో నెంబర్ నో ఫైన్ నో ఎంట్రీ అన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. దీనివల్ల నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వేములవాడకు వచ్చే అవకాశం లేనందును నేరాలు జరిగినా వెహికిల్ నెంబర్ ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇక్కడి పోలీసులు. మొదటి ప్రయత్నంగా వేములవాడ పట్టణంలోని పెద్ద ఎత్తున వాహనాలు వచ్చే అవకాశం ఉన్న తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆదివారం నుండే ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నో నెంబర్ ప్లేట్ నో ఫైన్ నో ఎంట్రీ నినాదాన్ని అమలు చేస్తున్నారు. ఇదే పద్దతిని క్రమక్రమంగా వేములవాడ సబ్ డివిజన్ లోనే నెంబర్ ప్లేట్లకు ఎంట్రీ లేకుండా చేయాలని భావిస్తున్నారు ఇక్కడి పోలీసులు.

వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి

కట్టడి చేయక తప్పడం లేదు: వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి

రోజు రోజుకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎంవీ యాక్టు అమలు చేయడంలో భాగంగా ఫైన్లు వేసి పంపిస్తున్నాం. కానీ చిరు దొంగతనాలతో పాటు ఇతరాత్ర నేరాలు కూడా జరుగుతున్నందున వాటిని కట్టడి చేయాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందోనని ప్రయోగాత్మకంగా ఆలోచించాం. వేములవాడలోకి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను అనుమతించేది లేదని తేల్చిచెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయడం వల్ల వాహనదారులు ఎంవీ యాక్టును ఖచ్చితంగా అలము చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాదారులు కూడా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఇక నుండి అక్కడికి రానివ్వరన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. దీనివల్ల అటు క్రిమినల్స్ ను కంట్రోలో చేసే అవకాశం ఉండడంతో పాటు ఇటు ఎంవీ యాక్టు అమలు కూడా సులువు అవుతుందని అంచనా వేస్తున్నాం. అయితే ఎంవీ యాక్టులో భాగంగా ఉన్న మిగతా నిభందనలు అమలు చేయనట్టయితే ఖచ్చితంగా ఫైన్లు వేస్తాం.

You cannot copy content of this page