ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు…
దిశ దశ, కరీంనగర్:
అక్రిడేషన్ కార్డు ఉంటేనే అర్హులు అంటూ జర్నలిస్టులకు ఇబ్బందులకు కల్గిస్తున్న తీరుతో వారు విసుగు చెందారు. జర్నలిస్టులంటే అక్రిడేషన్ ఉండాలి… అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు అన్న రీతిలో వ్యవహరిస్తున్న తీరును చూసిన వారిలో సరికొత్త ఆలచన రేకెత్తింది. ఒకే వృత్తిలో ఉన్నా కూడా తోటి జర్నలిస్టులు అక్రిడేషన్ ముఖ్యమని లేని వారికి గుర్తింపు ఇచ్చేది లేదన్న రీతిలో కామెంట్స్ చేస్తుండడం వారిని ఆలోచింపజేసింది. ఇటీవల కాలంలో అక్రిడేషన్ కార్డు ఓ ఐడీ ప్రూఫ్ కన్నా ఎక్కువగా బ్రాండ్ ఇమేజ్ లా ఉపయోగిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం జర్నలిస్టు అనగానే గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండగా ఇటీవల కాలంలలో అక్రిడేషన్ ఉంటేనే గుర్తింపు ఇస్తున్న పరిస్థితి తయారు కావడం వారిని బాధించింది. దీంతో అక్రిడేషన్ లేని వారిని కూడా సమాజంలో విలువ ఉండాల్సిందేనని భావించిన నాన్ అక్రిడేట్ జర్నలిస్టులంతా కలిసి ప్రత్యేకంగా ఓ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. సహచర జర్నలిస్టులు కూడా అధికారుల ముందు చులకనగా మాట్లాడుతుండడంతో విలువలు మరింత దిగజారి పోతున్నాయన్న ఆందోళ వ్యక్తం చేస్తున్న అక్రిడేట్ జర్నలిస్టులు కూడా వీరితో జట్టు కడుతున్నారు. న్యూస్ కవర్ చేస్తున్న అందరికీ, కొంతమంది సీనియర్లు ప్రధాన పత్రికలో పని చేయకపోవడం వంటి కారణాల వల్ల అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో సీనియర్లు సైతం వివక్షకు గురవుతున్న తీరుపై ఆలోచించిన కరీంనగర్ జిల్లా రామడుగు జర్నలిస్టులు నాన్ అక్రిడేట్ జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ప్రారంభించారు. ఇందులో ప్రధాన పత్రికలకు చెందిన వారితో పాటు డిజిటల్ మీడియా రిపోర్టర్లు కూడా సభ్యులుగా ఉన్నారు. రామడుగు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షునిగా అక్రిడేట్ జర్నలిస్టు బొల్లబత్తిని శ్రీనివాస్(VELUGU) ను ఎన్నుకోగా… అధ్యక్షునిగా సంకిటి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పురాణం సంపత్, కోశాధికారిగా తోట కృష్ణ, ఉపాధ్యక్షులుగా సముళ్ల రమేష్, ఎండీ రజాక్, సలహాదారులుగా పీచు ఇంద్రారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జిట్టవేని రాజులతో పాటు ఇతర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
పార్టీ నేతల స్పందన
రామడుగులో ఏర్పాటు చేసిన నాన్ అక్రిడేట్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ కు వివిధ పార్టీల నాయకులు కూడా బాసటనిస్తున్నారు. న్యూస్ కవర్ చేసే విషయంలో అక్రిడేషన్ ఉండడమనేది ఓ మైలురాయి మాత్రమే కానీ అదే సర్టిఫికెట్ లాంటిది కాదని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. రామడుగు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post