ఉత్తర తెలంగాణ టు గోవా…

పీఆర్వోలతో క్యాంపెయిన్

దిశ దశ, నిఘా బ్యూరో:

రూ. లక్ష నుండి రెండు లక్షలు డిపాజిట్ చేయండి.. సకల సౌకర్యాలతో పాటు స్వేచ్ఛయుత ప్రపంచంలో జూదం ఆడుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి తీసుకెళ్లి తిరిగి ఇక్కడ చేర్చే వరకు ఖర్చంతా మాదే… ఇది ఓ స్థాయి వర్గాల్లో సాగుతున్న ప్రచారం తీరు….

ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఇప్పుడు గోవా ట్రిప్ పీఆర్వోలు వెంటాడుతున్నారు. అడ్వాన్సుగా రూ 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఫ్లైట్ టికెట్ గోవాలో అకామిడేషనన్, మందు విందు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేర్చేవరకూ అని ఖర్చులు తమ ఆర్గనైజేషన్ వెచ్చిస్తుందంటూ చెప్తున్నారు. ఒక్కొక్కరికి రూ 5 నుండి10 వేల వరకూ కమిషన్ ఇచ్చి మరీ అభ్యర్థుల కోసం ప్రమోషన్ చేస్తున్నారు.

అక్కడ స్వేచ్ఛ…

అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాలో గేమింగ్ యాక్టు అమలు చేసే విషయంలో వెసులుబాటు ఉంది. దీంతో ఇక్కడ క్యాసినో, కెనెస్ట్రా వంటి జూదం ఆడుకునేందుకు అక్కడికి వెల్లేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే గోవాలో పరిచయాలు ఉండడంతో పాటు జూదం ఆడుకునేందుకు అవసరమైన వాతావరణం నమ్మకంతో కూడుకున్నదై ఉండాలి. ఈ భరోసా కల్పించేందుకు హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ఆర్గనైజేషన్స్ తయారయ్యాయి. థాయ్ లాంటి విదేశాలకు వెల్లినా అక్కడి చట్టాలకు చిక్కితే ప్రమాదం ఉందని ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు తేల్చిచెప్పాయి. దీంతో మన దేశంలో మన స్వేచ్ఛ అన్న నమ్మకంతో జూదగాళ్లు గోవా బాట పడుతున్నారు. వీకెండ్స్ అయితే ఓ రకమైన డిపాజిట్, కామన్ డేస్ అయితే మరో రకమైన డిపాజిట్ చేయాలంటూ కండిషన్స్ పెడుతున్నాయి కొన్ని ఆర్గనైజేషన్లు. పీఆర్వోల వ్యవస్థ ద్వారా గోవా టూరిస్టుల సంఖ్య వేలల్లోనే ఉంటోందని సమాచారం.

కండిషన్ ఇదే…

గోవా ట్రిప్ అంతా ఫ్రీ అనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఊరుకోరు. వెల్లిన వారు విధిగా అక్కడ జూదం ఆడాల్సిందే. గేమింగ్ యాక్టులో పాల్గొని డిపాజిట్ డబ్బులు నిర్వహకులు చేతుల్లో పోయాల్సిందే. లేనట్టయితే వారు ఊరుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి గేమింగ్ లో పాల్గొనేందుకు మాత్రమే ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా వెల్లాల్సి ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఆ ఒక్కటి అదనం

అయితే ఈ గేమింగ్ యాక్టుతో పాటు అడిషనల్ “ఫెసిలిటీస్” కావాలంటే మాత్రం ఎక్స్ ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందని కూడా ప్రచారం చేస్తున్నాయట కొన్ని ఆర్గనైజేషన్స్. దీంతో అటు విందుతో కూడిన జూదం, ఇటు అదనపు సౌకర్యం కూడా కళ్లముందే కదలాడుతుంటుంటే ఒక్కొక్కరు గోవా టూర్ కు ఉత్సాహంతో పరిగెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. లీడర్ల నుండి కామన్ మెన్ వరకు ఇటీవల గోవా ట్రిప్పుల కోసం ఉవ్విళ్లూరుతుండడానికి కారణం ఇదని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు పలువురు.

You cannot copy content of this page