కార్మికుల భవనాన్ని వదలడం లేదు…

మావోయిస్టు వెంకటేష్ ఆగ్రహం

ఆజాం జాహి మిల్స్ కార్మికులు తమ హక్కుల సాధనం కోసం జరిపే పోరాటల కోసం నిర్మించుకున్న భవనాన్ని సైతం కబ్జాకోరులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని జెంఎండబ్లుపీ కార్యదర్శి వెంకటేశ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. 1957లో ఆజం జాహి మిల్స్ వర్కర్స్ యూనియన్ వెంకట్రామ టాకీస్ సమీపంలో 1400 గజాల స్థలంలో కార్మికుల భవనం నిర్మించుకున్నారన్నారు. కార్మికుల శ్రమించి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న భవనమని దీనిని ఆక్రమించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు షాపింగ్ మాల్స్ యజమాని కలిసి బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెంకటేష్ ఆరోపించారు. ఆ తరువాత దీనిని ఓ షాపింగ్ మాల్ కు విక్రయించడంతో కొనుగోలు చేసిన వారు బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారన్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారి శ్రమ దోపిడీని అడ్డుకోవాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భఊ అక్రమనలు తీవ్రం అయ్యాయని ఆరోపించారు. కార్మికులంతా కలిసి పోరాటం చేసి కార్మిక భవన్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని వెంకటేష్ సూచించారు.

You cannot copy content of this page