నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1410 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ తెలిపింది. ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు ఇందులో 1410 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు పదో తరగతి అర్హత. బీఎస్ఎఫ్ జాబ్ రిక్రూట్ మెంట్ 2023 పేరుతో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్, డ్రాఫ్ట్ మ్యాన్, టిన్ స్మిత్, టైలర్, కాబ్లర్, బార్బర్, మాలి, స్వీపర్, వాషర్ మ్యాన్, కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్, బట్చర్ తదితర స్పెషలైజేషన్ లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. bsf.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. రాపపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు నెలకు రూ.21,700 నుంచి రూ,.69,100 వరకు జీతం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్ లో సూచించిన విధంగా శారీరక కోలతలు కలిగి ఉండాలి. అభ్యర్థులకు ఫిటె నెస్ టెస్టులు లాంటివి నిర్వహిస్తారు. ఆసక్తికగల అబ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సూచించింది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణత కావడంతో ఈ పోస్టులు భారీ దరఖాస్తులు వచ్చే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివినవారు కూడా దరఖాస్తు చేసుకుంటారు.

You cannot copy content of this page