నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో ఖాళీగా ఉన్న 14,523 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి భర్తీ చేపట్టాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ లేఖ రాసింది. దీంతో త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 20 కేటగిరీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్‌లో రాతపరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పంజాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఉద్యోగాల భర్తీ కంప్లీట్ చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ లేఖ రాసింది. అయితే ఇందులోని ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ఇతర పోస్టులతో సంబంధం లేకుండా ప్రత్యేక నోటిఫికషన్ జారీ చేయనున్నారు. ఖాళీల విషయానికొస్తే.. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 1005, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ 4765, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 467, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 578, డిజిటల్ అసిస్టెంట్ 736, విలేజ్ అగ్రిక్చలర్ అసిస్టెంట్ 467, సెరికల్చర్ అసిస్టెంట్ 23, పిషరీస్ అసిస్టెంట్ 60, ఇంజినీరింగ్ అసిస్టెంట్ 982, వార్డు వానిటేష్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ 153, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ 371, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ 459 పోస్టులు ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ 1127 పోస్టులు ఉండగా.. ఉమెన్ పోలీస్, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ పోస్టులు 1092 ఉన్నాయి. ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులు 618 ఉన్నాయి. కొత్త ఏడాదిలో రాబోతున్న ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. కాగా జగన్ అధికారంలోకి వచ్చి తర్వాత లక్షకుపైగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.